Jagan Mohan Reddy : ఇలా జరుగుతుందని గాని.. ఇలా అవుతుందని గాని ఎవరు ఊహించలేదు. చివరికి సాక్షిలో పనిచేసే వారు కూడా అంచనా వేయలేదు. జగన్ పర్యటన అంటే కొంతలో కొంత ప్లానింగ్ ఉంటుంది. ఇప్పుడు అసలే అధికారం కోల్పోయి ఉన్నాడు కాబట్టి.. ఏదో ఒక విధంగా క్రౌడ్ సృష్టించాలని.. ప్రభుత్వం మీద విమర్శలు చేయాలని జగన్ కచ్చితంగా కోరుకుంటాడు.
వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని జగన్ బలంగానే నిర్ణయించుకున్నాడు. ఇందులో తప్పులేదు. తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు. కానీ ప్లానింగే పరమ వరస్ట్ గా ఉంది. 11 స్థానాలు వచ్చినచోట.. గెలవాలని అనుకోవడం ఒకరకంగా అత్యాశ. కానీ దానిని సాధ్యం చేసుకోవాలని కోరుకోవడం మంచి సాహసమే. అయితే ఆ సాహసాన్ని సాధ్యం చేసుకునే అంశంలో జగన్ బొక్క బోర్లా పడుతూనే ఉన్నాడు.
తాజాగా సిదిరి అప్పలరాజు శిక్ష అనుభవిస్తున్న శ్రీకాకుళం జైలులో పరామర్శించడానికి జగన్ తాడేపల్లి ప్రాంతం నుంచి బయలుదేరారు. జైలు ముందుకు వచ్చిన తర్వాత సీన్ ఒక్కసారిగా మారిపోయింది… సార్ సమయం అయిపోయింది.. అంటూ జైలు అధికారులు చెప్పడంతో.. జగన్ కి ఏమీ అర్థం కాలేదు. దీంతో జగన్ జైలు గోడల దర్శనంతోనే.. తన పరామర్శ యాత్రను ముగించారు.
సిదిరి అప్పలరాజును పరామర్శించాలని జగన్ అనుకున్నారు. సాయంత్రంలోగా దాన్ని పూర్తి చేయాలనే కనీస స్పృహను జగన్ కోల్పోయారు. విశాఖపట్నం శివారు ప్రాంతాల నుంచి గంటలు తరబడి రోడ్డు షోలు చేసి.. టైం వేస్ట్ చేశారు జగన్. జనం విపరీతంగా వస్తున్నారని బిల్డప్ ఇచ్చారు. సోషల్ మీడియా కంటెంట్ కోసం రకరకాల ప్రయత్నాలు చేశారు. సాయంత్రం ఐదు గంటలు దాటిన తర్వాత శ్రీకాకుళం జైలు వద్దకు జగన్ చేరుకున్నారు. అయితే అధికారులు నిబంధనల గురించి వివరించిన తర్వాత.. కలవడం కుదరదని చెప్పిన తర్వాత.. జగన్ నిశ్శబ్దంగా వెళ్లిపోయారు.
ఒకవేళ అప్పలరాజును పరామర్శించాలి అనుకుంటే జగన్ ముందుగానే జైలుకు చేరుకొని.. ఆయనతో మాట్లాడవచ్చు. కానీ హంగామా చేసిన తర్వాత జగన్ అక్కడికి వచ్చారు. దీంతో సమయం దాటిపోవడంతో పరామర్శించకుండానే వెళ్ళిపోయారు. అప్పలరాజును పరామర్శించడానికి వెళ్లి.. చివరికి జైలు గేట్ల దర్శనమే దక్కడంతో ఫ్యాన్ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. దీంతో తాడేపల్లి నుంచి శ్రీకాకుళం వరకు సాగించిన హంగామా.. షార్ట్స్.. రీల్స్ అన్ని వృధా అయ్యాయి.