CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrabab) వీలైనంతవరకు ప్రజల్లో ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ప్రతి నెల పింఛన్ల పంపిణీలో భాగంగా ఏదో ఒక జిల్లాను సందర్శిస్తున్నారు. మధ్యలో ప్రత్యేకమైన దినాల్లో సైతం జిల్లాల పర్యటన చేస్తున్నారు. అందులో భాగంగా అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని గుంటూరు జిల్లాలో పర్యటించారు. పొన్నెకల్లు గ్రామంలోని ఎస్సీ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ దళిత కుటుంబ పరిస్థితిని చూసి చలించిపోయారు. ఆ కుటుంబానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడు బైక్ రిపేర్ షాప్ నడుపుతున్నాడు. ఈ క్రమంలో అతడి ఇంటి కి వెళ్లి ఊహించని ఆనందం పంచారు. అతడి కుటుంబ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే వరాల జల్లు కురిపించారు. సీఎం చంద్రబాబు సహాయానికి ఫిదా అయ్యారు సదరు యువకుడి కుటుంబం.
Also Read: వక్ఫ్ బిల్లుకు అనుకూల ఓటింగ్.. కోర్టులో పిటిషన్.. వైసిపి ద్వంద వైఖరి
* ప్రజలతో మమేకం..
సాధారణంగా చంద్రబాబు తీరు మారింది. నేరుగా ఇప్పుడు ఆయన ప్రజలను కలుస్తున్నారు. వారి పరిస్థితిని తెలుసుకొని వెనువెంటనే సాయం ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రవీణ్( bike mechanic Praveen) కుటుంబాన్ని పరామర్శించారు చంద్రబాబు. సరైన టూల్స్ లేకుండా మెకానిక్ పని ఎలా చేస్తావు? నీకు ఏ సాయం కావాలి అంటూ ఆరా తీశారు. అతడికి మంచి శిక్షణ ఇచ్చి.. మెరుగైన వసతులతో గ్యారేజ్ ఏర్పాటుకు ఆర్థిక సాయం చేయాలని అధికారులతో పాటు స్థానిక నేతలకు సూచించారు సీఎం చంద్రబాబు. అంతటితో ఆగకుండా ఇల్లు కూడా మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. మంచి స్థలంలో షాప్ పెట్టించి టూల్స్ ఇవ్వాలని కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సదరు యువకుడి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు. కలలో కూడా తన ఇల్లు, మెకానిక్ షెడ్ కు సీఎం స్థాయి లాంటివ్యక్తి వస్తారని ఊహించలేదని సంబరపడిపోయారు మెకానిక్ ప్రవీణ్ కుమార్.
* మారిన చంద్రబాబు తీరు..
అయితే ఇటీవల చంద్రబాబు తన స్టైల్ మార్చుకున్నారు. ప్రజలతో మమేకం అయ్యేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. పింఛన్ల పెంపులో భాగంగా పేద లబ్ధిదారులతో మాట్లాడారు. వారి కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని చూశారు. ఉచితంగా గ్యాస్( free gas) సిలిండర్ కంపెనీలో భాగంగా ఓ పేద కుటుంబాన్ని పలకరించారు. తానే స్వయంగా టీ చేసి అందరికీ ఇచ్చారు. ప్రతి నెల పింఛన్ల పంపిణీలో భాగంగా ఏదో ఒక జిల్లాను సందర్శిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో అక్కడ లబ్ధిదారులతో పాటు సామాన్య ప్రజలను పలకరించి వారితో మమేకం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే చంద్రబాబులో ఈ గుణం గతంలో ఎన్నడూ చూడలేదని అధికారిక వర్గాలు కూడా చెబుతున్నాయి.
* రెండు రోజుల కిందట అలా..
రెండు రోజుల కిందట బాబు జగ్జీవన్ రామ్( Babu Jagjivan Ram) జయంతి సందర్భంగా.. ఓ బార్బర్ షాప్ కు వెళ్లి అందరిని ఆశ్చర్యపరిచారు చంద్రబాబు. సంబంధిత బార్బర్ ను అనేక రకాలుగా ప్రశ్నించారు. ఆదాయంతో పాటు ప్రభుత్వపరంగా సాయం గురించి ఆరా తీశారు. వెనువెంటనే ప్రభుత్వపరంగా చాలా రకాల సాయాలను ప్రకటించారు. అది మరువక ముందే దళిత వర్గానికి చెందిన ఓ యువకుడ్ని పలకరించి.. కష్టాలను తెలుసుకొని వెనువెంటనే ఆదుకునే ప్రయత్నం చేయడం అందరినీ ఆకట్టుకుంటుంది.