Sri Krishna Janmashtami : నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి.. అష్టమి రోజున శ్రీకృష్ణుడు కారాగారంలో జన్మించాడు. పురాణ గాధల ప్రకారం కంసుడు అనేకరకాల కష్టాలు పెట్టినప్పటికీ కృష్ణుడు ఎదుగుతాడు. చివరికి కంసుడి భరతాన్ని పడతాడు. యశోద వద్ద పెరుగుతాడు కాబట్టి.. గోకులంలో యాదవులకు అత్యంత ఇష్టమైన వ్యక్తిగా కృష్ణుడు రూపాంతరం చెందుతాడు.
యాదవులు కృష్ణుడిని తమ కులస్తుడిగా చెప్పుకుంటారు. అందువల్లే కృష్ణాష్టమి వేడుకలను యాదవ కులస్తులు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఉత్తర భారత దేశంలోని ఉత్తర ప్రదేశ్.. మధ్యప్రదేశ్.. మహారాష్ట్ర.. బీహార్.. గుజరాత్.. వంటి ప్రాంతాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. జన్మాష్టమి రోజు ఉట్టి కొట్టే వేడుకను అత్యంత ఘనంగా జరుపుతారు. వాస్తవానికి శ్రీకృష్ణ జన్మాష్టమి ఒక పండుగ మాత్రమే కాదు.. అంతకుమించి..
వ్యాపార వర్గాల అంచనా ప్రకారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా రకరకాల వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. ఒక నివేదిక ప్రకారం మనదేశంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా 25 వేల కోట్ల నుంచి 40 వేల కోట్ల వరకు భారీ వ్యాపారాలు జరుగుతాయని సమాచారం. అఖిల భారతీయ వర్తకుల సమాఖ్య నివేదికల ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థను బలపేతం చేయడంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ కీలకపాత్ర పోషిస్తుంది. ఈ పండుగ రోజు శ్రీకృష్ణుడి విగ్రహాలు.. నెమలి ఈకలు.. ఉయ్యాలలు.. పువ్వులు.. లైటింగ్ వస్తువుల విక్రయాలు జోరుగా సాగుతూ ఉంటాయి. బాలకృష్ణుడి కోసం ప్రత్యేకంగా తయారు చేసే దుస్తులు.. ముత్యాల హారాలు.. లడ్డూలు.. వెన్న.. నెయ్యి.. ఇతర పాల ఉత్పత్తులు.. మఖాన.. ఇంకా రకరకాల స్వీట్లు విక్రయాలు భారీగా జరుగుతుంటాయి.
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా చాలా ప్రాంతాలలో మహిళలు.. పెళ్లికాని యువతులు.. యువకులు ఉపవాస ఉంటారు. శ్రీకృష్ణుడికి నువ్వులు..నెయ్యి.. బెల్లం.. సుగంధ ద్రవ్యాల మిశ్రమమంతో తయారుచేసిన లడ్డూలను నైవేద్యంగా పెడతారు.. కొన్నిచోట్ల పాలు.. పెరుగు మిశ్రమతో తయారుచేసిన వంటకాలను కూడా స్వామి వారికి పెడుతుంటారు. మనదేశంలో శ్రీకృష్ణుడు కొలువై ఉన్న ఆలయాలలో ఈరోజు పూజ నిర్వహిస్తూ ఉంటారు. ఉట్టికొట్టే కార్యక్రమాలు జరుపుతుంటారు. సనాతన ధర్మాన్ని మనదేశంలో విరివిగా పాటిస్తూ ఉంటారు. అందువల్లే పండగల సందర్భంగా చాలామందికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. దీని వెనక వేలకోట్ల వ్యాపారం జరుగుతూ ఉంటుంది. స్థానికంగా వివిధ రకాల వస్తువుల ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది.