Homeఎంటర్టైన్మెంట్Karthik Subbaraj: 'గేమ్ చేంజర్' కథని నాశనం చేశారు అంటూ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ హాట్...

Karthik Subbaraj: ‘గేమ్ చేంజర్’ కథని నాశనం చేశారు అంటూ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ హాట్ కామెంట్స్!

Karthik Subbaraj: #RRR వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం లో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై , ఎంత పెద్ద డిజాస్టర్ గా నిల్చిందో అందరికీ తెలిసిందే. నిర్మాత దిల్ రాజు ఈ చిత్రం కోసం ఎప్పుడూ పెట్టనంత బడ్జెట్ పెట్టాడు. శంకర్ ఏది కోరితే అది ఇచ్చాడు. కానీ ఔట్పుట్ ని మాత్రం ఆ స్థాయిలో రాబట్టుకోలేకపోయాడు. […]

Karthik Subbaraj: #RRR వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం లో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై , ఎంత పెద్ద డిజాస్టర్ గా నిల్చిందో అందరికీ తెలిసిందే. నిర్మాత దిల్ రాజు ఈ చిత్రం కోసం ఎప్పుడూ పెట్టనంత బడ్జెట్ పెట్టాడు. శంకర్ ఏది కోరితే అది ఇచ్చాడు. కానీ ఔట్పుట్ ని మాత్రం ఆ స్థాయిలో రాబట్టుకోలేకపోయాడు. గేమ్ చేంజర్ షూటింగ్ మధ్యలోనే ఆయన ‘ఇండియన్ 2’ కి షిఫ్ట్ అవ్వడం, ఆ సినిమా పూర్తి అయ్యాక విడుదలై భారీ డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం తో ‘గేమ్ చేంజర్’ పై ప్రభావం పడింది. దీంతో షూటింగ్ ఆరంభం లో ఉన్న హైప్ మొత్తం డైల్యూట్ అయ్యింది. దీంతో ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు , క్లోజింగ్ లో డిజాస్టర్ గా మిగిలింది.

ఇకపోతే ఈ సినిమాకు ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కథ ని అందించాడు. అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో , ఈ చిత్రం గురించి కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ , గేమ్ చేంజెర్ ఒరిజినల్ కంటెంట్ ఏంటంటే , ఒక కలెక్టర్ సిస్టం లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాడు , సీఎం ని సైతం గద్దెని ఎలా దింపాడు అనే దానిపై ఉంటుంది. మాఫియా బ్యాక్ డ్రాప్ సెటప్ కూడా ఉంటుంది. కానీ రామ్ చరణ్ పెద్ద సూపర్ స్టార్ అవ్వడం తో ఆయన ఇమేజ్ కి తగ్గట్టుగా శంకర్ గారు స్క్రీన్ ప్లే లో మార్పులు చేర్పులు చేశారు , అందుకే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది అంటూ చెప్పుకొచ్చాడు కార్తీక్ సుబ్బరాజ్. ఒకవేళ కార్తీక్ సుబ్బరాజ్ అందించిన స్క్రిప్ట్ ని తూచా తప్పకుండ అనుసరించి ఉండుంటే నేడు గేమ్ చేంజర్ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా మన ముందు ఉండేది ఏమో అని అంటున్నారు విశ్లేషకులు.

ఇకపోతే ప్రస్తుతం రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వం లో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. వచ్చే నెలలో ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు మొదలు కాబోతున్నాయి. ఈ సినిమాతో పాటు భవిష్యత్తులో రామ్ చరణ్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం లో నటిస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే కార్తీక్ సుబ్బరాజ్ రామ్ చరణ్ తో చేస్తాడో లేదో తెలియదు కానీ , మెగాస్టార్ చిరంజీవి తో చేసే అవకాశాలు ఉన్నాయి. రీసెంట్ గానే మెగాస్టార్ చిరంజీవి ని కలిసి ఆయన ఒక పవర్ ఫుల్ స్టోరీ ని వినిపించాడట. ప్రస్తుతం కాకా మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ ఉన్న చిరంజీవి , ఈ సినిమా పూర్తి అయ్యాక తన నిర్ణయాన్ని చెప్పే అవకాశాలు ఉన్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper