Homeఆంధ్రప్రదేశ్‌Mithun Reddy: తొక్కించేయ్ నేను చూసుకుంటా.. ఇంతే కాదు, పుంగనూరులో మిథున్ రెడ్డి ఏం చేశారంటే?

Mithun Reddy: తొక్కించేయ్ నేను చూసుకుంటా.. ఇంతే కాదు, పుంగనూరులో మిథున్ రెడ్డి ఏం చేశారంటే?

Mithun Reddy: తొక్కించేయ్.. నేను చూసుకుంటా.. పుంగనూరులో మిథున్ రెడ్డి టిడిపి శ్రేణులను ఎస్కార్ట్ వాహనాలతో తొక్కించడానికి ప్రయత్నించారు.. వాస్తవానికి గౌరవ ఎంపి స్థానంలో ఉన్న అతను వీధి రౌడీ మాదిరిగా రెచ్చిపోయారు. అక్కడితోనే ఆగిపోలేదు.. పుంగనూరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రంలో రిటర్నింగ్ ఆఫీసర్ ను చంపేస్తానంటూ బెదిరించారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారిపై బెదిరింపులకు పాల్పడడం పట్ల ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవానికి పుంగనూరులో జరిగింది ఇదేనా.. తెర వెనుక ఏమైనా ఉందా.. […]

Mithun Reddy: తొక్కించేయ్.. నేను చూసుకుంటా.. పుంగనూరులో మిథున్ రెడ్డి టిడిపి శ్రేణులను ఎస్కార్ట్ వాహనాలతో తొక్కించడానికి ప్రయత్నించారు.. వాస్తవానికి గౌరవ ఎంపి స్థానంలో ఉన్న అతను వీధి రౌడీ మాదిరిగా రెచ్చిపోయారు. అక్కడితోనే ఆగిపోలేదు.. పుంగనూరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రంలో రిటర్నింగ్ ఆఫీసర్ ను చంపేస్తానంటూ బెదిరించారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారిపై బెదిరింపులకు పాల్పడడం పట్ల ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవానికి పుంగనూరులో జరిగింది ఇదేనా.. తెర వెనుక ఏమైనా ఉందా..

స్థానిక సంస్థలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్న వేళ పుంగనూరులో వైసిపి నాయకులు ఉద్దేశపూర్వకంగానే భారీ ఎత్తున ఘర్షణలు చోటు చేసుకోవడానికి రూపకల్పన చేశారు. ఏపీలో వైసిపి అధికారాన్ని కోల్పోయిన తర్వాత.. పెద్దిరెడ్డి కుటుంబానికి పుంగనూరు మీద పట్టు తగ్గుతున్న వేళ.. ఇంతటి దారుణానికి పాల్పడ్డారని మిథున్ రెడ్డిని ఉద్దేశించి టిడిపి నేతలు అంటున్నారు. ఇందులో భాగంగానే కావాలని ఉద్రిక్తతలను రెచ్చగొట్టే విధంగా.. మిథున్ రెడ్డికి అత్యంత వ్యతిరేకంగా ఉన్న ప్రాంతాల మీదుగా తన అనుచరులతో కలిసి భారీ వాహనశ్రేణితో కదిలినట్టు సమాచారం. పుంగనూరులో జరిగిన విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే.. అందులో ఉన్న కుట్ర కోణం ఎలాంటిదో తెలుస్తుంది.

అధికారంలో లేకపోయినప్పటికీ పుంగనూరు ప్రాంతంలో హవా కొనసాగించడానికి.. కిందిస్థాయి కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికి మిథున్ రెడ్డి కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి ప్రశాంతంగా జరగాల్సిన నామినేషన్ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా హింసాత్మకంగా మార్చేశారు. తన కుటుంబానికి వ్యతిరేకంగా ఉన్న ప్రాంతాలు.. కూటమికి పట్టుకున్న ప్రాంతాల మీదుగా భారీ కాన్వాయితో వెళ్లాలని నిర్ణయించుకున్నారు.. అలాగే ముందుకు వెళ్లిపోయారు.

కాన్వాయ్ లో మిథున్ రెడ్డికి అనుచరులు లేరు. పుంగనూరులో ప్రవేశించిన తర్వాత మిథున్ రెడ్డి వర్గంలో ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా అక్కడి వాతావరణం పూర్తిగా మార్చేశారు. కూటమినేతలను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడం మొదలుపెట్టారు. రెచ్చగొట్టే విధంగా నినాదాలు చేశారు. హడావిడి చేశారు. దీంతో అప్పటికే కూటమినేతలు అక్కడ భారీగా ఉన్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. మిథున్ రెడ్డి వాహన శ్రేణి ముందుకు వెళుతున్న కొద్దీ ఉద్రిక్తత మరింత పెరిగింది. నామినేషన్ కేంద్రంలో మిథున్ రెడ్డి కాన్వాయ్ లోని ఒక కారు బీభత్సం సృష్టించింది. అందరిని తొక్కించడానికి ప్రయత్నించారు. దీంతో మిథున్ రెడ్డికి వివిధ రంగా ఉన్న వ్యక్తులు మొత్తం ఒక్కసారిగా రోడ్లమీదకి వచ్చారు. వాహన శ్రేణుని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో మిథున్ రెడ్డి శ్రేణిలోని వాహనాలు ధ్వంసమయ్యాయి.

వైసిపి కార్యకర్తలు ముందుగా దాడులకు దిగడంతో.. ఆత్మ రక్షణ కోసం టిడిపి కార్యకర్తలు కూడా తిరుగుబాటు చేయాల్సి వచ్చింది. పరిస్థితి ఒక్కసారిగా చేతుల నుంచి జారిపోయింది. నామినేషన్ సెంటర్లో మిథున్ రెడ్డి ఉండడంతో. దాడికి సిద్ధమయ్యారు.. పరిస్థితి మరింత తీవ్రంగా మారడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆ తర్వాత మిథున్ రెడ్డిని వెంటనే నామినేషన్ కేంద్రంలోకి తీసుకెళ్లి. . ఒక గదిలో భద్రత కల్పించారు. అయినప్పటికీ ప్రత్యర్థి వర్గాలు అక్కడికి దూసుకురావడానికి ప్రయత్నించారు. దీంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

ఇరు వర్గాలను నియంత్రించడానికి.. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కొంతమందికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు కర్త కర్మ క్రియ మిధున్ రెడ్డి. అయితే ఆయన రచించిన వ్యూహం చివరికి ఇంతటి హింసకు దారి తీసింది. హింసకు పాల్పడాలనే ఉద్దేశంతోనే మిథున్ రెడ్డి అక్కడికి వచ్చారు. ఆయన వాహనాలలో మద్యంతోపాటు మారణాయుధాలు కూడా ఉన్నాయి. ఘర్షణలో ఆ వాహనాలు ధ్వంసం కావడం విశేషం. అందువల్లే మద్యం.. మారణాయుధాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper