HomeNewsBigg Boss Telugu 8: ఓటింగ్ లో ఎవ్వరూ అందుకోలేని రేంజ్ కి వెళ్లిపోయిన గౌతమ్..డేంజర్...

Bigg Boss Telugu 8: ఓటింగ్ లో ఎవ్వరూ అందుకోలేని రేంజ్ కి వెళ్లిపోయిన గౌతమ్..డేంజర్ జోన్ లో విష్ణు ప్రియ!

నిఖిల్, ప్రేరణ ఓట్లు ఏకపక్షంగా యష్మీ కి పడినప్పటికీ కూడా టేస్టీ తేజ యష్మీ ని దాటేసాడంటే ఆయన గ్రాఫ్ ఏ రేంజ్ లో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి గౌతమ్, టేస్టీ తేజ కి మధ్య 5 శాతం ఓటింగ్ తేడా ఉంది.

Bigg Boss Telugu 8: గత వారం డబుల్ ఎలిమినేషన్ ద్వారా గంగవ్వ, హరితేజ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్లిపోగా, ఈ వారం యష్మీ, పృథ్వీ, విష్ణు ప్రియ, టేస్టీ తేజ, గౌతమ్ మరియు అవినాష్ నామినేట్ అయ్యారు. వీరిలో అందరూ ఊహించినట్టుగానే గౌతమ్ అత్యధిక ఓటింగ్ తో నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. ఆయన దరిదాపుల్లో మరో కంటెస్టెంట్ లేరు అనే చెప్పాలి. అదే విధంగా టేస్టీ తేజ కూడా భారీ ఓటింగ్ తో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. నిఖిల్, ప్రేరణ ఓట్లు ఏకపక్షంగా యష్మీ కి పడినప్పటికీ కూడా టేస్టీ తేజ యష్మీ ని దాటేసాడంటే ఆయన గ్రాఫ్ ఏ రేంజ్ లో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి గౌతమ్, టేస్టీ తేజ కి మధ్య 5 శాతం ఓటింగ్ తేడా ఉంది. ఈ వారం హౌస్ మేట్స్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ అందరూ హౌస్ లోకి వస్తారు, ఒక్క టేస్టీ తేజ ఫ్యామిలీ తప్ప. దీంతో ఆయన మీద సానుభూతి పెరిగే అవకాశం ఉంది, ఈ వారం ఓటింగ్ లో గౌతమ్ ని డామినేట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఇది ఇలా ఉండగా మూడవ స్థానం లో యష్మీ కొనసాగుతుంది. తన ఓటింగ్ తో పాటు , నిఖిల్,ప్రేరణ అభిమానుల ఓటింగ్ కూడా తోడు అవ్వడం వల్ల ఆమె మూడవ స్థానంలో కొనసాగుతుంది. గత వారం ఆమె ఎలిమినేషన్ చివరి వరకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. గంగవ్వ ఆరోగ్య సమస్యల కారణంగా సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వకపోయుంటే కచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ లో యష్మీ కూడా ఎలిమినేట్ అయ్యేది. ఆమె లక్ చూడండి ఎలా ఉందో. యష్మీ తర్వాత నాల్గవ స్థానంలో పృథ్వీ కొనసాగుతున్నాడు. తన ఓటింగ్ తో పాటు, నిఖిల్ ఫ్యాన్స్ ఓటింగ్ కూడా తోడు అవ్వడంతో పృథ్వీ నాల్గవ స్థానంలో ఉన్నాడు. అలాగే చివరి రెండు స్థానాల్లో అవినాష్, విష్ణు ప్రియ కొనసాగుతున్నారు.

వీళ్ళిద్దరిలో విష్ణు ప్రియ చివరి స్థానం లో ఉంది. అవినాష్ కి ఈమెకు మధ్య ఓటింగ్ తేడా కూడా ఏకంగా 3 శాతం ఉంది. విష్ణు ప్రియ లాంటి ఫ్యాన్ బేస్ ఉన్న కంటెస్టెంట్ ఇలా డేంజర్ జోన్ లోకి వస్తుందని ఆడియన్స్ కలలో కూడా ఊహించలేదు. తనకంటే పృథ్వీ ఎక్కువ అని చెప్పడం, పృథ్వీ కోసం ఏదైనా చేస్తానని అనడం, పృథ్వీ యే తన జీవితం,, సర్వస్వం అన్నట్టుగా విష్ణు ప్రియ ప్రవర్తించడం వల్లనే ఆమె గ్రాఫ్ ప్రతీ వారం తగ్గుతూ వస్తూ నేడు ఎలిమినేషన్ జోన్ లోకి వచ్చేలా చేసింది. అయితే నబీల్ వద్ద ‘ఎవిక్షన్ ఫ్రీ పాస్’ ఉంది. ఈ పాస్ ని నబీల్ విష్ణు కోసం ఉపయోగిస్తాడా?, లేకపోతే అవినాష్ కోసం ఉపయోగిస్తాడా అనేది తెలియాల్సి ఉంది. నబీల్ ఇద్దరితోనూ స్నేహంగానే ఉన్నాడు, మొదటి వారం నుండి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ కాబట్టి విష్ణు కి ఆ పాస్ ఉపయోగించే అవకాశం ఉంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper