Bigg Boss 10 Telugu: ఈమధ్యనే మొదలైనట్టుగా అనిపిస్తున్న ‘బిగ్ బాస్ 10′ అప్పుడే క్లైమాక్స్ కి చేరుకుంది. 11 వారాలు పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో మరో నాలుగు వారాల్లో ముగియనుంది. ఈ సీజన్ పరిస్థితి ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ బ్లాక్ బస్టర్, సెకండ్ హాఫ్ డిజాస్టర్ అన్నట్టుగా ఉంది. మొదటి 50 రోజులు రోహిత్ కారణంగా TRP రేటింగ్స్ బ్లాస్ట్ అయ్యాయి. ముఖ్యంగా రోహిత్ , త్రిగున్ మధ్య జరిగే గొడవలు చాలా ఆసక్తిగా ఉండేవి. కానీ బిగ్ బాస్ టీం నెంబర్ 1 స్థానంలో ఉన్న రోహిత్ ని అత్యంత అన్యాయంగా కంటెస్టెంట్స్ ఓటింగ్ తో ఎలిమినేట్ చేయడం తో , ఈ షో పై ఆడియన్స్ లో ఉన్న విశ్వాసం పూర్తిగా పోయింది. దీంతో ఇప్పుడు రేటింగ్స్ పాతాళంలోకి పడిపోయాయి. ఇదంతా పక్కన పెడితే రోహిత్ ఎలిమినేట్ అయ్యాక, ప్రస్తుతం ఉన్నటువంటి కంటెస్టెంట్స్ లో టాప్ 5 గా ఎవరెవరు నిలబడబోతున్నారో ఇప్పుడు చూద్దాం.
ప్రస్తుతానికి సోషల్ మీడియా ఓటింగ్ లో ముకేశ్ నెంబర్ 1 స్థానం లో కొనసాగుతున్నాడు. రోహిత్ హౌస్ లో ఉన్న చివరి రోజుల్లో ముకేష్ తో స్నేహం గా ఉండడం అతనికి ఓటింగ్ లో బాగా కలిసొస్తుంది. ప్రస్తుతానికి రోహిత్ ఫ్యాన్స్ అత్యధిక శాతం ముకేశ్ కి వేస్తున్నారు. ఇక ఆయన తర్వాతి స్థానం లో త్రిగున్ కొనసాగుతున్నాడు. ఇతని గేమ్ అత్యధిక శాతం ఆడియన్స్ కి నచ్చకపోయినా, హౌస్ లో ఎదో ఒక కంటెంట్ ఇస్తుండడం తో పాటు, మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ చాలా వీక్ అవ్వడంతో, వేరే గతి లేక ఆడియన్స్ ఇతనికి ఓట్లు వేస్తున్నారు. పైగా ఇతని పీఆర్ మామూలు రేంజ్ లో లేదనే చెప్పాలి. ఇక త్రిగున్ తర్వాత మూడవ స్థానంలో దేబ్జాని కొనసాగుతోంది. హౌస్ లో ఎలాంటి గేమ్స్ ఆడకుండా , మ్యానేజ్మెంట్ కోటాలో సర్వైవ్ అవుతూ వచ్చిన బెంగాల్ టైగర్ ఈమె. ఒకటి రెండు టాస్కుల్లో తన సత్తా చాటిన విషయం వాస్తవమే కానీ, టాప్ 3 లో ఉండేంత సీన్ ఉన్న కంటెస్టెంట్ మాత్రం కాదు.
అయితే వర్షిణి లాంటి వీక్ కంటెస్టెంట్ ని 11 వారాల నుండి కొనసాగిస్తూ వచ్చిన బిగ్ బాస్ టీం, దేబ్జాని ని టాప్ 3 లో ఉంచడం లో పెద్ద వింతేమీ లేదులే అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు. ఇక టాప్ 4 స్థానంలో కొనసాగుతున్న కంటెస్టెంట్ అమన్. ఇతను స్నేహానికి ద్రోహం చేసినప్పటికీ , టాస్కులు అద్భుతంగా ఆడుతూ రావడం తో ఆడియన్స్ బాగానే ఓట్లు వేస్తున్నారు. గత వారం కూడా ఆయన కఠినమైన టాస్కులు ఆడి గెలిచి ఇంటికి కెప్టెన్ అయ్యాడు. కాబట్టి అమన్ టాప్ 4 లో ఉండేందుకు అర్హుడు అనే చెప్పాలి. ఇక 5 వ స్థానంలో కొనసాగుతున్న కంటెస్టెంట్ రామ్ ప్రసాద్. హౌస్ లో పెద్దన్న పాత్ర పోషించడమే కాకుండా, గేమ్స్ కూడా బాగా ఆడడంతో ఈయనకు ఓట్లు బాగానే పడుతున్నాయి. కానీ ఇతను చేసిన కొన్ని పనుల కారణంగా గుంత నక్క అనే ట్యాగ్ వచ్చింది. అది ఈయన్ని మరో లెవెల్ కి వెళ్లనివ్వకుండా ఆపేసింది. లేకపోతే రామ్ ప్రసాద్ కి ఉన్న క్రేజ్ కి కచ్చితంగా టైటిల్ విన్నింగ్ రేస్ లో ఉండాలని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు. ఇక సుధీర్, శివ్ వంటి వారికి టాప్ 5 లో ఉండేందుకు అర్హత ఉన్నప్పటికీ , వాళ్ళు చేసిన కొన్ని తప్పుల కారణంగా ఆ రేస్ నుండి తప్పుకున్నారు. ఓవరాల్ గా ఈ అంశం పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.