Homeజాతీయం - అంతర్జాతీయంRobotic Borewell Technology: ఇక బోర్వెల్ తో పనిలేదు.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న ఇండియన్ కొత్త టెక్నాలజీ..

Robotic Borewell Technology: ఇక బోర్వెల్ తో పనిలేదు.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న ఇండియన్ కొత్త టెక్నాలజీ..

Robotic Borewell Technology: నేటి సమస్య అనగానే చాలామందికి గుర్తుకు వచ్చేది బోర్వెల్. ఇంటి అవసరాలైనా.. వ్యవసాయ భూమైనా.. భూగర్భ జలాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. అయితే భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో వేసిన బోర్లు ఎండిపోతున్నాయి ఒక బోరు ఎండిపోతే మరో బోరు వేయడం.. అది కూడా ఎండిపోతే మరింత లోతుకు తవ్వించడం.. ఇలా లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. కానీ, ఇకపై ఎండిపోయిన బోర్ల విషయంలో ఇలాంటి ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది. […]

Robotic Borewell Technology: నేటి సమస్య అనగానే చాలామందికి గుర్తుకు వచ్చేది బోర్వెల్. ఇంటి అవసరాలైనా.. వ్యవసాయ భూమైనా.. భూగర్భ జలాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. అయితే భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో వేసిన బోర్లు ఎండిపోతున్నాయి ఒక బోరు ఎండిపోతే మరో బోరు వేయడం.. అది కూడా ఎండిపోతే మరింత లోతుకు తవ్వించడం.. ఇలా లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. కానీ, ఇకపై ఎండిపోయిన బోర్ల విషయంలో ఇలాంటి ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఉన్న బోర్వెల్ లను తిరిగి ఉపయోగంలోకి తీసుకొచ్చే సరికొత్త రోబోటిక్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది.

ఈ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా ఇప్పటికే వినియోగంలో ఉన్న బోర్వెల్ ను తిరిగి ఉపయోగంలోకి తీసుకు రావచ్చు. ఈ టెక్నాలజీ ఎలా ఉంటుంది.. బోర్ వేయకుండానే దీని ద్వారా నీటిని ఎలా పొందవచ్చు.. ప్రపంచంలో తొలిసారిగా భారతదేశంలో ఈ టెక్నాలజీ ఎలా మొదలైంది.. అనే విషయాలను ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

పూణే ప్రాంతానికి చెందిన urdhvam environmental technolgies సంస్థ అభివృద్ధి చేసిన bore charger టెక్నాలజీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సాధారణంగా బోర్వెల్ వేసినప్పుడు దాని లోపల కేసింగ్ పైపును ఏర్పాటు చేస్తారు. భూమిలోపలి మట్టి కూలిపోకుండా ఈ పైపు రక్షణగా ఉంటుంది. అయితే కొన్ని సందర్భాలలో ఈ పైపు కారణంగా పై పొరల్లో ఉన్న నీరు బోర్వెల్ లోకి చేరే అవకాశం తగ్గుతుంది. దీంతో లోతుల్లోని భూగర్భ జలాలను నిరంతరం తోడయడం వల్ల బోరు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.

ఈ సమస్యకు పరిష్కారంగా రోబోటిక్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఎండిపోయిన బోర్వెల్ లోకి ప్రత్యేకమైన కెమెరాను పంపించి లోపలి పరిస్థితిలను పరిశీలిస్తారు.. ఆ తర్వాత రోబోటిక్ పరికరాన్ని బోరులోకి పంపిస్తారు. అది నిర్దిష్టమైన లోతుల్లోకి కేసింగ్ పైపుకు చిన్న రంద్రాలు చేస్తుంది. దీంతో చుట్టుపక్కల ఉన్న నీటిని నిలువ చేసుకున్న భూగర్భ పొరల నుంచి బోర్వెల్ లోకి నీరు చేరే అవకాశం ఉంటుంది.

ఈ టెక్నాలజీలో ఆసక్తికరమైన విషయం ఏంటంటే వైద్యరంగంలో ఉపయోగించే ఈ యాంజియోగ్రఫీ.. యాంజియో ప్లాస్టి తరహా లోనే బోర్వెల్ కి కూడా ప్రత్యేకమైన ప్రక్రియ నిర్వహిస్తారు. ముందుగా కెమెరా సహాయంతో బోర్వెల్ లోపలి పరిస్థితిలను పరిశీలిస్తారు. ఎక్కడ నీటి పొరలు ఉన్నాయి? ఎక్కడ నీటి రీఛార్జ్ కు అవకాశం ఉంది? అనే అంశాలను గుర్తిస్తారు. ఆ తర్వాత రోబోటిక్ పరికరంతో ఫేసింగ్ పైపులు అవసరమైన చోట రంద్రాలు చేస్తారు. దీంతో వర్షపు నీరు భూగర్భంలోని పై నీటి పొరల నుంచి లోతైన జలాశయాలకు చేరేందుకు మార్గం ఏర్పడుతుంది. ఇలా ఇప్పటికే ఎండిపోయిన లేదా తక్కువనిటిని అందిస్తున్న బోర్లను తిరిగి ఉపయోగం లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు.

ఈ టెక్నాలజీ విజయవంతంగా పనిచేస్తే రైతులకు గణనీయమైన ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా బోర్లు ఎండిపోయిన ప్రతిసారి కొత్తగా బోర్లు వేయాల్సిన అవసరాన్ని తగ్గించవచ్చు. కొత్త బోరు తవ్వడానికి అయ్యే ఖర్చుతో పాటు విద్యుత్ కనెక్షన్లు.. ఇతర నిర్వహణ కర్చులు కూడా ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఇళ్లల్లో బోర్లు ఎండిపోయినప్పుడు.. ట్యాంకర్ల ద్వారా అన్నిటినీ కొనుగోలు చేసే కుటుంబాలకు కూడా ఈ విధానం ఉపయోగపడుతుంది. ఈ టెక్నాలజీని మహారాష్ట్రలోని లాతూర్ వంటి నీటి ఎద్దడి ప్రాంతాల్లో కూడా ప్రయోగించారు. లాతూర్ నగరంలో సుమారు 300 తక్కువ అన్నిటిని అందిస్తున్న లేదా ఎండిపోయిన బోర్లకు ఈ విధానం ద్వారా రీఛార్జ్ కల్పించారు. వాటి ద్వారా ఏడాదికి 20.6 కోట్ల లీటర్ల నీటి రీఛార్జి సామర్థ్యం ఉంటుందని అప్పట్లో అంచనా వేశారు.

ఈ టెక్నాలజీ ద్వారా ప్రతి ఎండిపోయిన బోరు నుంచి నీళ్లు రావడం సాధ్యం కాదు. బోరు ఉన్న ప్రాంతంలో భౌగోళిక పరిస్థితులు.. భూగర్భ జలాలు లభ్యత.. నీటి పొరల స్వభావం వంటి అంశాల మీద ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అలాగే ఈ విధానం కొత్త బోర్లు వేయాల్సిన అవసరాన్ని పూర్తిగా తొలగించే అవకాశం లేదు. ఇప్పటికే ఉన్న బోర్లను రీఛార్జ్ చేసి వాటి వినియోగాన్ని పెంచడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ టెక్నాలజీకి పేటెంట్ రైట్ కూడా ఉంది.

మనదేశంలో భూగర్భ జలాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో నీటి సంరక్షణ అత్యంత కీలకంగా మారింది. వర్షపు నీటిని భూమిలోకి ఇంకించే పద్ధతులతో పాటు ఆధునిక సాంకేతికతను ఉపయోగించడం కూడా అవసరమవుతోంది. ఈ నేపథ్యంలో రోబోటిక్ బోర్వెల్ రీఛార్జ్ టెక్నాలజీ ఒక వినూత్న ప్రయత్నం లాగా నిలుస్తోంది. కొత్త బోర్న్ వేయడం కంటే ఇప్పటికే ఉన్న బోర్లను ఉపయోగించి తీసుకురావడం సాధ్యమైతే రైతులకు.. సామాన్య ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper