Homeఎంటర్టైన్మెంట్Sree Leela: యంగ్ హీరో తో డేటింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన శ్రీలీల..పుట్టినరోజు ఊహించని గిఫ్ట్!

Sree Leela: యంగ్ హీరో తో డేటింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన శ్రీలీల..పుట్టినరోజు ఊహించని గిఫ్ట్!

Sree Leela: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన నటి శ్రీలీల. అతి చిన్న వయస్సులోనే కన్నడ సినీ ఇండస్ట్రీ ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన ఈ హాట్ బ్యూటీ, మన టాలీవుడ్ లోకి పెళ్లి సందడి అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న శ్రీలీల కి టాలీవుడ్ లో అవకాశాలు క్యూలు కట్టాయి. అతి తక్కువ సమయం లోనే […]

Sree Leela: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన నటి శ్రీలీల. అతి చిన్న వయస్సులోనే కన్నడ సినీ ఇండస్ట్రీ ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన ఈ హాట్ బ్యూటీ, మన టాలీవుడ్ లోకి పెళ్లి సందడి అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న శ్రీలీల కి టాలీవుడ్ లో అవకాశాలు క్యూలు కట్టాయి. అతి తక్కువ సమయం లోనే పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు వంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ తో, సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ వంటి సీనియర్ హీరోస్ సినిమాల్లో నటించే అవకాశం దక్కింది. కానీ ఈమె కెరీర్ మొత్తం మీద చూస్తే పూర్తి స్థాయి కమర్షియల్ సక్సెస్ లు అందుకున్న సినిమాలు ధమాకా, భగవంత్ కేసరి చిత్రాలు మాత్రమే. ఇక మిగిలిన సినిమాలన్నీ ఒక దాన్ని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ రావడంతో, ఈమెకు టాలీవుడ్ లో అవకాశాలు బాగా తగ్గిపోయాయి.

కానీ ఇప్పుడు తమిళం, హిందీ లో ఈమెకు అవకాశాలు బాగానే వస్తున్నాయి. అయితే ఈమె బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కార్తీక్ ఆర్యన్ తో కలిసి ఒక సినిమా చేసింది. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే మన ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయం లోనే ఆమెకు కార్తీక్ ఆర్యన్ తో మంచి సాన్నిహిత్య సంబంధం ఏర్పడింది. అది ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వైపు దారి తీస్తుందని లేటెస్ట్ బాలీవుడ్ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న మాట. ఇకపోతే రీసెంట్ గానే కార్తీక్ ఆర్యన్ పుట్టినరోజు జరిగింది. ఆయన ఏర్పాటు చేసిన ప్రైవేట్ పార్టీ లో శ్రీలీల కూడా పాల్గొనింది. అంతే కాకుండా ఆ పార్టీ లో కార్తీక్ ఆర్యన్ తో కలిసి దిగిన ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తూ, కార్తీక్ ఆర్యన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు, కనీసం పుట్టినరోజు నాడు అయినా షూటింగ్స్ నుండి విరామం తీసుకో అంటూ చెప్పుకొచ్చింది.

పుట్టినరోజు కి శుభాకాంక్షలు తెలిపినంత మాత్రాన వీళ్లిద్దరి మధ్య ఎదో జరుగుతుందని అనుకోవడం లేదు. గతం లో కార్తీక్ ఆర్యన్ తల్లి కూడా తన కొడుకు కాబోయే భార్య గురించి ఒక హింట్ ఇచ్చింది. నా కాబోయే కోడలు డాక్టర్ వృత్తికి చెందిన అమ్మాయి అంటూ చెప్పుకొచ్చింది. శ్రీలీల డాక్టర్ అనే విషయం అందరికీ తెలిసిందే. రీసెంట్ గానే ఆమె MBBS కూడా పూర్తి చేసింది. ఇలా అప్పటి నుండి జరిగిన సంఘటనలన్నీ పరిగణలోకి తీసుకోవడం వల్ల, వీళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారు అనే రూమర్స్ కి బలం చేకూరింది. సోషల్ మీడియా లో ఈ అంశం పై గత మూడేళ్ళ నుండి ఒక రేంజ్ లో చర్చించుకుంటున్నప్పటికీ కూడా, శ్రీలీల టీం ఒక్కసారి కూడా ఈ అంశంపై స్పందించలేదు. దీంతో వీళ్ళు రిలేషన్ లో ఉన్నారని నిర్థారించుకుంటున్నారు అభిమానులు. వచ్చే ఏడాది లో వీళ్లిద్దరు పెళ్లి పీటలు ఎక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper