spot_img
HomeNewsAllu Arjun: ఎన్టీయార్, రామ్ చరణ్ లను కలిపితే అల్లు అర్జున్ అంటున్నారు...నిజం గా ఆయనకి...

Allu Arjun: ఎన్టీయార్, రామ్ చరణ్ లను కలిపితే అల్లు అర్జున్ అంటున్నారు…నిజం గా ఆయనకి అంత సీన్ ఉందా..?

Allu Arjun: ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా పుష్ప 2 ఫీవర్ నడుస్తుంది. పుష్ప సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు అంతకు మించిన సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు. అందుకే ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇక సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలైతే ఉన్నాయి. మరి ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇలాంటి సందర్భంలో ఈ సినిమా 1000 కోట్లకు పైన కలెక్షన్లు రాబడుతుంది అంటూ మేకర్స్ భారీ రేంజ్ లో ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో అంత కలెక్షన్స్ వచ్చే అంత స్టఫ్ ఉందా లేదా అని మరి కొంతమంది సినీ మేధావులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా పుష్ప 2 సినిమాతో భారీ సక్సెస్ దక్కుతుందని అల్లు అర్జున్ భావిస్తున్నాడు. త్రిబుల్ ఆర్ సినిమా కంటే కూడా ఈ సినిమా ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ ని చేస్తుంది అంటూ కొన్ని ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు.

ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ ని కలిపితే ఎంత బిజినెస్ అయితే అయిందో ఒక అల్లు అర్జున్ మీద అంత బిజినెస్ జరగడంతో ఎన్టీయార్ రామ్ చరణ్ కంటే అల్లు అర్జున్ గ్రేట్ అంటూ కొంతమంది ప్రజలు ప్రోజక్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. నిజానికైతే పుష్ప 2 సినిమాకు ఆ రేంజ్ లో నిజంగానే బిజినెస్ జరిగిందా లేదంటే వీళ్ళు ఫేక్ అనౌన్స్ మెంట్ ఇచ్చారా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది.

ఇక ఇది చూసిన చాలామంది జనాలు మాత్రం అల్లు అర్జున్ అంటేనే కొంచెం అతి చేస్తూ ఉంటాడు. ఆయన చెప్పిందాంట్లో చేసేదాంట్లో ఏది నిజమైతే ఉండదు. అందులో చాలా వరకు ఫేక్ ముచ్చట్ల ఉంటాయి కాబట్టి ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఫేక్ అంటూ కొంతమంది దీనిని కొట్టి పారేస్తున్నారు. నిజానికి రామ్ చరణ్, ఎన్టీఆర్ లను కొట్టేంత దమ్ము అల్లు అర్జున్ కి ఉందా అంటూ మరి కొంతమంది ప్రశ్నిస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ మాత్రం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరోగా ఎదగాలనే ప్రయత్నంలోనే తన అడుగులను ముందుకు వేస్తున్నాడు. ఇక పుష్ప సినిమాతో ‘నేషనల్ అవార్డు’ ని అందుకున్న ఆయన ఇప్పుడు అంతకుమించి గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Jana Nayagan Twitter Review

Jana Nayagan Twitter Review: ‘జన నాయగన్ ‘ ట్విటర్ రివ్యూ : తెలుగు ఆడియన్స్ నుండి ఇలాంటి...

Jana Nayagan Twitter Review: తమిళనాడు ముఖ్యమంత్రి హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రం...
AP Rain Alert

AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈరోజు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని చెప్పింది. పిడుగులతో కూడిన వానలు పడతాయని...
Bhogapuram International Airport

Bhogapuram International Airport: భోగాపురం విమానాశ్రయం ప్రారంభం.. విద్యార్థులకు బంపర్ ఆఫర్!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం కానుంది. ఈనెల 1న ప్రారంభోత్సవానికి నోచుకోనుంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు....
Balakrishna

Balakrishna: బాలయ్య కి ఫోన్ చేసిన ఎన్టీఆర్… ఇంటికి కూడా వెళ్తున్నాడుగా…

Balakrishna: సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉన్నంత మాత్రాన సక్సెసులైతే రావు... స్టార్ డమ్ అనేది లభించదు. వాళ్ల సత్తాను చూపించి ప్రేక్షకులను మెప్పించగలిగితేనే వాళ్ళకంటూ ఒక ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. లేకపోతే మాత్రం...
Oktelugu Epaper