spot_img
Homeఅత్యంత ప్రజాదరణవైరల్: సన్ రైజర్స్ కు అండగా ‘గచ్చిబౌలి దివాకర్’ రె‘ఢీ’!

వైరల్: సన్ రైజర్స్ కు అండగా ‘గచ్చిబౌలి దివాకర్’ రె‘ఢీ’!

సంప్రదాయ మీడియాకు పూర్తి విరుద్ధంగా ముక్కుసూటిగా.. సెటైర్లతో ఉన్న వాస్తవాలను చెప్పేందుకైనా.. ఎవరిపైనా అయినా పంచులు పేల్చేందుకు ఇప్పుడు అందరికీ ‘సోషల్ మీడియా’ ఒక ఆయుధంగా కనిపిస్తోంది. ఏ సెలెబ్రెటీ తప్పు చేసినా కూడా మీమ్స్, ట్రోల్స్ తో ఉతికి ఆరేసేలా సోషల్ మీడియాలో నెటిజన్లు రెడీగా ఉంటున్నారు.

ఈ సంప్రదాయం కేవలం సగటు వ్యక్తులకే కాదు.. దిగ్గజ సంస్థలు, సెలెబ్రెటీలు, ఇతర ప్రముఖులకు కూడా ఉంది.తాజాగా మన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఒక పోస్ట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. బ్రహ్మానందంతో వదిలిన మీమ్ అందరికి నవ్వులు తెప్పిస్తోంది.

తాజాగా ఫిబ్రవరిలో ఐపీఎల్ 2021 కోసం మినీ వేలం నిర్వహించేందుకు బీసీసీఐ రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్ వేలంలో కెప్టెన్ స్టీవ్ స్మిత్ సహా దిగ్గజ ఆటగాళ్లను వదిలేసుకుంది. ఈ వేలంలో పెద్ద ఆటగాళ్లను కొనేందుకు రాజస్థాన్ వద్ద భారీగా డబ్బులు ఉన్నాయి. అందుకే తాజాగా రాజస్థాన్ రాయల్స్ ట్వీట్ చేసింది. ‘ఈ ఏడాది ఐపీఎల్ వేలం పాటలో ఉన్న కొందరు టాప్ క్రికెటర్లు వీరే.. మీకెవరు కావాలి ’ అని క్రికెటర్లు, సినిమాల్లోని హీరోల ఫొటోలను షేర్ చేసింది.

దీనికి సన్ రైజర్స్ హైదరాబాద్ ఫన్నీగా స్పందించింది. ఈ ట్వీట్ కు రిప్లైగా మన బ్రహ్మానందం నటించిన ‘కొంచెం ఇష్టం.. కొంచె కష్టం’ సినిమాలోని క్రికెట్ ఆడుతోన్న జిఫ్ ఫైల్ ను పోస్ట్ చేసింది. ‘మేం క్రికెటర్ ను ఇప్పటికే ఎన్నుకున్నం’ అంటూ కామెంట్ చేసింది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో బ్రహ్మానందం ‘గచ్చిబౌలి దివాకర్’ అనే పాత్రలో క్రికెటర్ గా కామెడీ పండించిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అయ్యింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

AP Rain Forecast

AP Rain Forecast: మళ్లీ నైరుతి.. ఏపీకి చల్లటి కబురు!

AP Rain Forecast: రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. గత ఏడాదికంటే సాధారణ వర్షపాతం తక్కువగానే నమోదయింది.. జూన్లో లోటు కనిపించింది. జూలైలో సైతం కొనసాగింది....
Chandrababu

Chandrababu: స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు సంచలనం!

Chandrababu: ఏపీలో స్థానిక ఎన్నికలకు కూటమి ప్రభుత్వం సిద్ధపడింది. వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. ముందుగా మున్సిపల్, తర్వాత ప్రాదేశిక, చివరిగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. అయితే ఈసారి...
Modi Gen Z Video

Modi Gen Z Video: అర్ధరాత్రి సొంతంగా మరో వీడియో.. తనలోని Gen-Zని ఆవిష్కరిస్తున్న మోదీ

Modi Gen Z Video: దేశవాసియో అనే మాట లేదు. బయో బహనో అనే వాక్యం లేదు. భారత్ మాతాకీ జై అనలేదు. జైశ్రీరామ్ అని చెప్పలేదు. జస్ట్ మై ఫ్రెండ్స్ అన్నాడు...
YSRCP Leaders

YSRCP Leaders: కుటుంబ వివాదాలే రాజకీయ కక్షలట!

YSRCP Leaders: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ వ్యక్తిగత వైఖరితో ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. చిన్న వివాదాలను సైతం పెద్దది చేసుకొని పోలీస్ కేసులకు గురవుతున్నారు. అరెస్టుల బారిన పడుతున్నారు. మొన్ననే మాజీమంత్రి...
Megastar Chiranjeevi

Megastar Chiranjeevi: చిరంజీవి కి ఆ ఇద్దరు దర్శకులంటే చాలా ఇష్టం…

Megastar Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న ఏకైక నటుడు మెగాస్టార్ చిరంజీవి...కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఒక మిడిల్ క్లాస్...
Oktelugu Epaper