Homeఎంటర్టైన్మెంట్Anil Ravipudi: అనిల్ రావిపూడి కొత్త సినిమాలో బ్రహ్మానందం...ఇప్పటి వరకు ఆయనను తీసుకోకపోవడానికి కారణం ఇదే...

Anil Ravipudi: అనిల్ రావిపూడి కొత్త సినిమాలో బ్రహ్మానందం…ఇప్పటి వరకు ఆయనను తీసుకోకపోవడానికి కారణం ఇదే…

Anil Ravipudi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి… ఈ మధ్యకాలంలో ఆయన నుంచి వస్తున్న ప్రతి సినిమా రొటీన్ రెగ్యులర్ ఫార్మాట్లోనే ఉంటున్నాయి. అయినప్పటికి ఆయన సినిమాలు ప్రేక్షకులను అలరించడంలో ఆ ఎప్పుడు సక్సెస్ అవుతూనే ఉన్నాయి. ఈ సంవత్సరం ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన వచ్చే సంవత్సరం వెంకటేష్ – కళ్యాణ్ రామ్ లను హీరోలుగా […]

Anil Ravipudi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి… ఈ మధ్యకాలంలో ఆయన నుంచి వస్తున్న ప్రతి సినిమా రొటీన్ రెగ్యులర్ ఫార్మాట్లోనే ఉంటున్నాయి. అయినప్పటికి ఆయన సినిమాలు ప్రేక్షకులను అలరించడంలో ఆ ఎప్పుడు సక్సెస్ అవుతూనే ఉన్నాయి. ఈ సంవత్సరం ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన వచ్చే సంవత్సరం వెంకటేష్ – కళ్యాణ్ రామ్ లను హీరోలుగా పెట్టి 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో మరోసారి తన ఖాతాలో మరో విజయాన్ని అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన వరుసగా తొమ్మిది విజయాలను సాధించాడు. ఇప్పుడు పదో సక్సెస్ ని సైతం తన ఖాతాలో వేసుకొని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి సినిమాల్లో కామెడీ ఎక్కువగా కనిపిస్తుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ బ్రహ్మగా పేరు సంపాదించుకున్న బ్రహ్మానందం మాత్రం అనిల్ రావిపూడి ఒక్క సినిమాలో కూడా లేడు.

అతన్ని తీసుకోకపోవడానికి గల కారణం ఏంటి అంటూ గతంలో నుంచి కొన్ని వార్తలైతే వెలువడుతున్నాయి. అయినప్పటికి అనిల్ రావిపూడి మాత్రం బ్రహ్మానందం ఇమేజ్ కి తగ్గ పాత్ర తన సినిమాలో రావడం లేదని, అందుకే బ్రహ్మానందం గారిని తీసుకోవడం లేదంటూ పలు సందర్భాల్లో క్లారిటీ ఇచ్చాడు.

ప్రస్తుతం వెంకటేష్ – కళ్యాణ్ రామ్ లను హీరోలుగా పెట్టి చేస్తున్న మల్టీ స్టారర్ సినిమాలో బ్రహ్మానందం కీలకపాత్రలో కనిపించబోతున్నారట…ఈ సినిమాతో అనిల్ రావిపూడి బ్రహ్మానందం ను ఎలా వాడుకుంటాడు.

బ్రహ్మానందం క్యారెక్టర్ కి ఒక సెపరేట్ ట్రాక్ ఉంటుందా లేదంటే ఏదైనా సీరియస్ పాత్రలో బ్రహ్మానందం ను చూయించబోతున్నారా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఈ మూవీ తర్వాత అనిల్ రావిపూడి తన తర్వాత సినిమాను బాలయ్య బాబు తో చేయబోతున్నాడట…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper