spot_img
Homeఆంధ్రప్రదేశ్‌అపాయింట్‌మెంట్‌ ఇచ్చినంత మాత్రాన కలుపుకున్నట్లేనా..?

అపాయింట్‌మెంట్‌ ఇచ్చినంత మాత్రాన కలుపుకున్నట్లేనా..?

Chandrababu naidu
బీజేపీ అగ్రనేతల అపాయింట్‌మెంట్‌ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నాళ్లుగానో వెయిట్‌ చేస్తున్నారు. కానీ.. వారు అస్సలు దగ్గరకు రానివ్వడం లేదు. దాదాపు రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు టీడీపీకి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ దొరికింది. దీంతో టీడీపీ నేతల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ పార్టీలో రెట్టించిన ఉత్సాహం కనిపిస్తోంది. ఎట్టకేలకు అమిత్‌షాను కలిసిన టీడీపీ ఎంపీలు.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరించారు.

Also Read: షాకింగ్: అచ్చెన్నాయుడును అరెస్టు చేయించింది నిమ్మగడ్డనేనా?

ప్రధానంగా ఆలయాలపై జరుగుతున్న దాడులు, మతమార్పిడులు, టీడీపీ నేతలపై నమోదవుతున్న అక్రమ కేసులు, దాడుల విషయాన్ని కూడా అమిత్ షా వద్ద ప్రస్తావించారు. అమిత్ షాతో భేటీ ముగిసిన తర్వాత బయటకు వచ్చిన ఎంపీలు తమకు అమిత్ షా హామీ ఇచ్చారని చెప్పారు. కేంద్ర హోంశాఖకు ఆధారాలను సమర్పించాలని కోరినట్లు చెప్పారు. తాము ఆధారాలతో సహా హోంశాఖకు సమర్పిస్తామని తెలిపారు. అమిత్ షాతో భేటీ కేవలం నిమిషాల వ్యవధిలోనే జరిగిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ ఎంపీలు ఇచ్చిన వినతి పత్రాన్ని అమిత్ షా స్వీకరించారని అంతకుమించి అక్కడ ఏమీ జరగలేదని వెంటనే బీజేపీ నేతలు రియాక్ట్ కావడం విశేషం.

2018లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాక బీజేపీ నేతలతో టీడీపీ నేతలు కలిసింది లేదు. పైగా ఎన్నికల సమయంలో ప్రధాని మోదీపై పార్టీ అధినేత చంద్రబాబు వ్యక్తిగత విమర్శలు చేశారు. తిరుపతి వచ్చిన అమిత్ షాపైనా టీడీపీ నేతలు దాడికి యత్నించారు. ఇవన్నీ ఎలా మర్చిపోతామని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు ఇప్పటి వరకూ ఢిల్లీ గడప కూడా తొక్కలేదు. రెండేళ్ల తర్వాత తొలిసారి అమిత్ షా టీడీపీ నేతలకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Also Read: పంచాయతీ ఎన్నికల్లో నోట్ల హవా: అడ్డంగా బుక్కైన టీడీపీ నేతలు

మరోవైపు.. అమిత్ షా అపాయింట్‌మెంట్ మంచి సంకేతాలని టీడీపీ భావిస్తోంది. భవిష్యత్‌లో కలిసి పనిచేసేందుకు తొలి అడుగు పడిందంటున్నారు. కానీ.. రాష్ట్ర బీజేపీ నాయకత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. బీజేపీలో టీడీపీని విలీనం చేసే ఆలోచన ఉంటే అప్పుడు తాము నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. మొత్తానికి టీడీపీలో మాత్రం తమ ఫిర్యాదుపై అమిత్ షా స్పందించకున్నా పరవాలేదు కాని, అపాయింట్‌మెంట్ ఇచ్చారు చాలన్న తృప్తి మాత్రం వారిలో కనిపిస్తోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Ravi Teja

Ravi Teja: రవితేజ ఇరుముడి తో కంబ్యాక్ ఇస్తున్నాడా…

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ఇంతకుముందు చేసిన సినిమాలతో భారీ డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. హీరోలు చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలి. కానీ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే సినిమాల...
AI Farming Technology

AI Farming Technology: మందులు కాదు.. ఇకపై పంటలు పండాలంటే ఈ కెమెరాలే కావాలి..

AI Farming Technology: భూమిలో సారం మెరుగ్గా ఉంటే పంటలు అద్భుతంగా పండుతాయి. ఇది ఒకప్పుడు.. ఇప్పుడు భూమిలో సారం ఉన్నప్పటికీ పంటలు సరిగ్గా పడడం లేదు. దీని కారణం వాతావరణంలో మార్పులు....
Jeetendra Property

Jeetendra Property: 4.25 లక్షల పెట్టుబడి..450 కోట్లు వచ్చేశాయి.. అదృష్టం అంటే ఈయనదే పో

Jeetendra Property: ఈరోజుల్లో డబ్బులు ఎవరికి ఊరికే రావు. కష్టపడితే తప్ప పైసలు సంపాదించలేం. సంపాదించిన డబ్బులు సక్రమమైన మార్గాలలో పెట్టుబడి పెడితే దండిగా లాభాలు వస్తాయి. అప్పుడు మన సొమ్ము...
Jogi Ramesh

Jogi Ramesh: చిక్కుల్లో మాజీ మంత్రి రమేష్ ఫ్యామిలీ!

Jogi Ramesh: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వ్యక్తిగత కేసులు చుట్టుముడుతున్నాయి. మొన్నటికి మొన్న మాజీ మంత్రి అప్పలరాజు తన కుమారుడు ప్రమాదం మూలంగా చిక్కుల్లో పడ్డారు. బైక్ ప్రమాదానికి కారణమైన తన...
Akhil Akkineni

Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...
Oktelugu Epaper