Homeఅత్యంత ప్రజాదరణRaghu Rama Krishna Raju : వైసీపీకి యాభై సీట్లే.. రఘురామ సర్వే వెల్లడి

Raghu Rama Krishna Raju : వైసీపీకి యాభై సీట్లే.. రఘురామ సర్వే వెల్లడి

Raghu Rama Krishnam RajuRaghu Rama Krishnam Raju: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సర్వేల సందడి మొదలైంది. వివిధ పార్టీల భవితవ్యాలు తేల్చే సర్వేలను పార్టీలు నిర్వహిస్తున్నాయి. తమ బలాలు, బలహీనతల గురించి తెలుసుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో సైతం సర్వేలు వైరల్ అవుతున్నాయి. తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghu Rama Krishnam Raju) ఓ సర్వే వివరాలు ప్రకటించారు. రాష్ర్టంలో టెలిఫోన్ సర్వే చేయించారు. వైసీపీకి ప్రస్తుత పరిస్థితుల్లో యాభై సీట్లు కూడా రావని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు, చిత్తూరు జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేల పరిస్థితి మాత్రమే బాగుందని పేర్కొన్నారు. మిగతా వారు గెలవడం కష్టమే అని చెప్పారు. నర్సాపురంలో జగన్ కంటే తనకే తొంభై శాతం ఎక్కువ ఆదరణ ఉందన్నారు.

వాస్తవానికి సర్వేను బయట పట్టదల్చుకోకున్నా కొన్ని కారణాల వల్ల బహిర్గతం చేయాల్సి వచ్చిందని ఎంపీ రఘురామ పేర్కొన్నారు. కొద్ది రోజులుగా తనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో తాను కూడా సర్వే చేయించానని గుర్తు చేశారు. తనపై చేస్తున్న సర్వేపై రఘురామ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. తనపై కావాలనే తప్పుడు సర్వేలు పెడుతూ అనవసర పోస్టులు పెడుతున్నారని విమర్శలు చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ పరిస్థితి బాగాలేదని చెప్పారు. సీట్ల విషయంలో ప్రస్తుత పరిస్థితుల్లో అయితే యాభై సీట్లు కూడా దాటవని, తరువాత పరిస్థితి తాను చెప్పలేనని అన్నారు. ఇటీవల ఇండియా టుడే మూడ్ ఆప్ ది నేషన్ పోల్స్ ప్రకటించిన తరువాత సోషల్ మీడియాలో సర్వేల హడావిడి పెరిగిందన్నారు. ఏపీలో సర్వేల పరిస్థితి ఎక్కువగా ఉంది. అయితే తనపై కావాలనే దురుద్దేశంతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివరించారు. తన సర్వే బూటకమని చెప్పడం నాయకుల తెలివితక్కువ తనానికి నిదర్శనమని వివరించారు.

ఈ నేపథ్యంలో వైసీపీ పరిస్థితిపై రఘురామ వెల్లడించడంతో నాయకులు హైరానా పడుతున్నారని చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ విజయం ఖాయమని చెబుతున్నా వారిలో కూడా ఏదో ఒక చోట భయం పట్టుకుంది. దీంతో రఘురామ వర్సెస్ వైసీపీ గా రాజకీయం సాగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. సర్వే వివరాలతో నాయకుల్లో భయం పట్టుకుందని రఘురామ పేర్కొన్నారు. భవిష్యత్ లో పార్టీల భవితవ్యంపై అందరు సర్వేల బాట పడుతున్నారని చెప్పారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
CM Vijay Pregnant Woman Honor

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...
Weight Loss

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...
HYDRA Ranganath

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ కు రాం రాం.. తెలంగాణ హైకోర్టు సంచలనం

HYDRA Ranganath: హైడ్రా.. తెలంగాణలో 2023లో కొలువుదీరిన రేవంత్‌రెడ్డి సర్కార్‌ హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువులు, కుంటల ఆక్రమణల తొలగింపు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అదించేందుకు ఏర్పాటు...
Kerala Innovation

Kerala Innovation: అమ్మ కష్టం చూడలేక.. ఈ కొడుకు చేసిన పని.. ఏకంగా సీఎం చప్పట్లు కొట్టాడు..

Kerala Innovation: ఉదయం లేవగానే ఇల్లు ఊడ్చి.. కల్లాపి చల్లాలి. ముగ్గు పెట్టాలి. బట్టలు ఉతకాలి. టీ దగ్గర నుంచి మొదలు పెడితే కూర వరకు వండాలి. ఇంటిని శుభ్రం చేయాలి. ఇన్ని...
Oktelugu Epaper