Homeఆంధ్రప్రదేశ్‌Botsa Satyanarayana: 13 గ్రామాల నాయకులు.. బొత్స ను జగన్ మళ్లీ పరామర్శించాల్సిందే..

Botsa Satyanarayana: 13 గ్రామాల నాయకులు.. బొత్స ను జగన్ మళ్లీ పరామర్శించాల్సిందే..

Botsa Satyanarayana: ఇప్పటివరకు వివిధ అక్రమాలు.. అవినీతి కార్యకలాపాలకు పాల్పడి.. జైలుకు వెళ్లిన వైసీపీ నాయకులకు జగన్ పరామర్శ తెలిపారు. ఓదార్పు అందించారు. కానీ ఇప్పుడు తొలిసారిగా జైలుకు వెళ్ళని.. ఇంకా ఎటువంటి కేసులు నమోదు కానీ నాయకుడిని మరోసారి పరామర్శించాల్సి వస్తోంది. ఒకరకంగా ఓదార్పు ఇవ్వాల్సి వస్తోంది. ఇంతకీ ఆ నాయకుడెవరు.. ఆ కథ ఏమిటంటే.. స్థానిక ఎన్నికలకు ముందు ఉత్తరాంధ్ర ప్రాంతంలో నారా లోకేష్ వేసిన ఎత్తులకు వైసీపీ చిత్తయిపోయింది. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లోనే […]

Botsa Satyanarayana: ఇప్పటివరకు వివిధ అక్రమాలు.. అవినీతి కార్యకలాపాలకు పాల్పడి.. జైలుకు వెళ్లిన వైసీపీ నాయకులకు జగన్ పరామర్శ తెలిపారు. ఓదార్పు అందించారు. కానీ ఇప్పుడు తొలిసారిగా జైలుకు వెళ్ళని.. ఇంకా ఎటువంటి కేసులు నమోదు కానీ నాయకుడిని మరోసారి పరామర్శించాల్సి వస్తోంది. ఒకరకంగా ఓదార్పు ఇవ్వాల్సి వస్తోంది. ఇంతకీ ఆ నాయకుడెవరు.. ఆ కథ ఏమిటంటే..

స్థానిక ఎన్నికలకు ముందు ఉత్తరాంధ్ర ప్రాంతంలో నారా లోకేష్ వేసిన ఎత్తులకు వైసీపీ చిత్తయిపోయింది. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లోనే ఇక్కడ కూటమి విజయ గర్వాన్ని మరింత ప్రదర్శించింది. చరిత్రలో ఎన్నడు లేనివిధంగా స్థానాలు గెలిచి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కూడా అదే స్థాయి చూపించాలని కూటమి భావిస్తోంది. ఈ క్రమంలోనే నారా లోకేష్ వేసిన ఎత్తులకు ఉత్తరాంధ్రలో కీలక నాయకులు టిడిపిలోకి వస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు వైసిపికి పెద్ద దిక్కుగా ఉన్న బొత్స సత్యనారాయణ మేనల్లుడు.. విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీను టిడిపిలో చేరారు. అంతే ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. అంతేకాదు ఇక్కడ వైసిపి కూసాలు కదిలిపోతున్నాయి.

ఈ పరిణామంతో బొత్స ఆ మధ్య కన్నీరు పెట్టుకున్నారు. రాజకీయాలలో విలువలు లేవంటూ వాపోయారు. ఈ నేపథ్యంలో ఆయనకు తాడేపల్లి నుంచి పిలుపు వచ్చింది. జగన్ నుంచి పరామర్శ లభించింది. అంతేకాదు.. బొత్స సత్యనారాయణ కుమార్తెకు భీమిలి నియోజకవర్గ ఇన్చార్జి పదవి కూడా లభించింది. అయితే ఇక్కడితోనే బొత్స కు బాధలు తప్పిపోలేదు. ఆయనను మరింత ఇబ్బంది పెట్టే విధంగా టిడిపి పావులు కదిపింది. విజయనగరం జిల్లాలో ఏకంగా దాదాపు 13 గ్రామాలకు సంబంధించిన వైసీపీ నాయకులు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అది కూడా బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గంలో ఈ సంఘటన జరిగింది.. చీపురుపల్లి పరిధిలోని మెరక ముడిదాం మండలంలో దాదాపు 13 గ్రామల వైసిపి నాయకులు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వీరిలో మాజీ సర్పంచులు.. మాజీ ఎంపీటీసీలు ఉన్నారు. ఈ పరిణమంతో వైసిపికి ఈ ప్రాంతంలో మరింత షాక్ తగిలింది. అయితే ఇది ఇక్కడితోనే అయిపోతుందా.. రాజీనామాల పర్వం మరింత జోరుగా సాగుతుందా అనేది తెలియాల్సి ఉంది. ఈ పరిణామంతో బొత్సకు మరోసారి జగన్ పరామర్శ కావాలని.. ఆయన ఓదార్పు అవసరమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకప్పుడు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని తన కంటి చూపుతో శాసించిన బొత్స.. ఇప్పుడు అదే కంటితో విలపించడం విశేషం.

ఉత్తరాంధ్ర ప్రాంతంలో తలపండిన రాజకీయ నాయకుడిగా బొత్స సత్యనారాయణ కు పేరుంది. పైగా ఆయన ఉత్తరాంధ్ర ప్రాంతంలో రాజకీయాలను అనేక దశాబ్దాలుగా శాసిస్తూ వస్తున్నారు. అటువంటి నాయకుడికి ఇటువంటి పరిస్థితి రావడం నిజంగా కార్యకర్తలకు అంతు చిక్కడం లేదు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు బొత్స సానుకూలంగా వ్యవహరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందువల్లే నారా లోకేష్ ఈ స్థాయిలో దూకుడు చూపిస్తున్నారని.. వైసీపీని నామరూపాలు లేకుండా చేస్తున్నారని.. స్థానిక ఎన్నికల్లో ఇదే సీన్ కనిపిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper