NLC Recruitment 2021: ప్రముఖ కంపెనీలలో ఒకటైన నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్(NLC) నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 675 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి ఈ సంస్థ జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లు సంవత్సరం పాటు అప్రెంటీస్ గా పని చేయాల్సి ఉంటుంది. సంస్థ అవసరాన్ని బట్టి సర్వీసును పొడిగించటం జరుగుతుంది. ఐటీఐ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. www.nlcindia.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పోస్టు, విద్యార్హతను బట్టి నెలకు రూ. 8,766, రూ. 10,019, రూ. 12,524 స్టైఫండ్ గా చెల్లించే అవకాశం ఉంటుంది. ఐటీఐ, బీకామ్, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
2019, 2020, 2021లో బీకామ్, బీఎస్సీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్ ఎల్ సీ అఫిషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 25 ఆగస్టు 2021 ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ప్రింట్ ఔట్, సంబంధిత డాక్యుమెంట్లను ఈ నెల 30వ తేదీలోగా పంపాల్సి ఉంటుంది.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ లో పూర్తి వివరాలను పరిశీలించి ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతోంది.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Nlc recruitment 2021 applications invited for 675 apprentice vacancies
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com