Homeజాతీయ వార్తలుVijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన తీర్పు. ఈ తీర్పు ఒకరకంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కి గట్టి ఎదురు దెబ్బ. చెంపపెట్టు లాంటి తీర్పు. వాస్తవానికి ఇలాంటి తీర్పు వస్తుందని.. న్యాయ విశ్లేషకులు ముందుగానే చెప్పారు. అయినప్పటికీ విజయ్ ప్రభుత్వం గుడ్డిగానే ముందుకు వెళ్ళింది. అంతేకాదు.. ఉద్యోగ నియామక […]

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన తీర్పు. ఈ తీర్పు ఒకరకంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కి గట్టి ఎదురు దెబ్బ. చెంపపెట్టు లాంటి తీర్పు. వాస్తవానికి ఇలాంటి తీర్పు వస్తుందని.. న్యాయ విశ్లేషకులు ముందుగానే చెప్పారు. అయినప్పటికీ విజయ్ ప్రభుత్వం గుడ్డిగానే ముందుకు వెళ్ళింది. అంతేకాదు.. ఉద్యోగ నియామక పత్రాలు అందించుకుంటూ విజయ్ తమిళనాడు పోలీసుల మీద తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఏకంగా హైకోర్టు తప్పు పట్టడం.. ఉద్యోగ నియామకాలను రద్దు చేయడంతో విజయ్ కి నోటి వెంట మాట రాని పరిస్థితి.

విజయ్ పార్టీ పెట్టిన తొలి రోజుల్లో.. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. కరూర్ ప్రాంతంలో ఒక సభ నిర్వహించారు. నిర్వహణలోపం వల్ల తొక్కిసలాట చోటుచేసుకుంది. దాదాపు 41 మంది చనిపోయారు . నాడు చనిపోయిన వారి కుటుంబ సభ్యులను విజయ్ పరామర్శించారు. తాను అధికారంలోకి వస్తే పరిహారంతో పాటు.. ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని అన్నారు.

ఇటీవల కరూర్ ప్రాంతంలో నిర్వహించిన సభలో విజయ్ 32 కుటుంబాల వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. 10 లక్షల పరిహారం కూడా పంపిణీ చేశారు. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఆ తర్వాత ఈ కేసును విచారించిన హైకోర్టు సోమవారం తుది తీర్పు వెల్లడించింది.. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుందని.. పరిహారం.. ఇతర పునరావాసం కల్పించవచ్చని.. అలా కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. దీనివల్ల ప్రజలకు సమాన హక్కులు కలిగే విషయంలో అంతరాలు ఏర్పడతాయని హైకోర్టు స్పష్టం చేసింది. తాజా తీర్పుతో నాడు కరూర్ ప్రాంతంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని.. తమ బతుకులు బాగుపడతాయని వారు భావించగా.. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇబ్బందికరంగా మారింది. మరి దీనిపై విజయ్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది.. ఏ విధమైన అడుగులు వేస్తుంది.. చూడాల్సి ఉంది.

నాడు ఉద్యోగ నియామక పత్రాలు అందించుకుంటూ విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు పోలీసుల మీద మండిపడ్డారు. అంతేకాదు కరూర్ మృతులకు నియామక పత్రాలు అందించి.. తనకు పొలిటికల్ మైలేజ్ పెరగడానికి తోడ్పాటు అందించుకున్నారు. అయితే దీనిపై కొన్ని రాజకీయ పార్టీలు నేరుగా విమర్శలు చేయకపోయినప్పటికీ.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే పనులు మాత్రం బ్రహ్మాండంగా చేశాయి. హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయించాయి. చివరికి విజయ్ కి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది ఇప్పుడు ఈ తీర్పు అక్కడి ప్రతిపక్ష పార్టీలకు కొత్త ఆయుధాన్ని అందించినట్లు అయింది. కోర్టు తీర్పురావడమే ఆలస్యం.. డీఎంకే . అన్న డిఎంకె టీవీకే మీద ఎదురు దాడి మొదలుపెట్టాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper