IBPS CSA Recruitment 2026 : బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ IBPS గుడ్ న్యూస్ చెప్పనుంది. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (CSA) పోస్టుల భర్తీకి సంబంధించి షార్ట్ నోటీస్ విడుదలైనట్లు తెలుస్తోంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా సుమారు 10 వేల నుంచి 15 వేల వరకు పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితె..
IBPS త్వలరో భారీగా నియామకాలు చేపట్టనుంది. ఇందులో భాగంగా దేశంలోని పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. దాదాపు 11 బ్యాంకులు ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆయా బ్యాంకులు ఇప్పటికే తమ అవసరాలకు అనుగుణంగా ఖాళీల వివరాలను IBPSకు అందించేందుకు సిద్ధమవుతున్నాయి. ఆ తరువాత పోస్టుల సంఖ్య ఖచ్చితమైన సమాచారం తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 15 వేల ఉద్యోగాల రిక్రూట్ మెంట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
CSA పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వీరు అదనంగా కంప్యూటర్ పరిజ్ఞానం ఉంచుకోవాలి. సంబంధిత రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన స్థానిక భాషపై అవగాహన వంటి అర్హతలు ఉండే అవకాశం ఉంది. అయితే విద్యార్హత, స్థానిక భాష, కంప్యూటర్ పరిజ్ఞానం తదితర నిబంధనలను పూర్తి నోటిఫికేషన్‌లోని అధికారికంగా వెల్లడిస్తారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండే అవకాశం ఉంది. అంటే గరిష్ఠంగా 28 ఏళ్లకు మించకూడదనే నిబంధన ఉండొచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు తదితర రిజర్వ్డ్ కేటగిరీల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. వయోపరిమితిలో సడలింపు లభించే అవకాశం ఉంది.
అన్నీ అనుకున్న సమయానికి ఖారారైతే ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 1 నుంచి ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. అదే నెల 21 వరకు గడువు విధించే అవకాశం ఉంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే అప్లికేషన్ పూర్తి చేసి, అవసరమైన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.సాధారణంగా CSA నియామక ప్రక్రియ రెండు దశల్లో ఆన్‌లైన్ లో ఉంటుంది. మొదటి దశలో ప్రిలిమినరీ పరీక్ష, ఆ తర్వాత అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. డిసెంబర్ 27 న మెయిన్ పరీక్ష జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పూర్తి నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభించడం మంచిది. ముఖ్యంగా ఆంగ్లపై పట్టు సాధించడం.. న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ వంటి అంశాలపై ప్రిలిమ్స్ కోసం దృష్టి పెట్టాలి. మెయిన్స్ కోసం జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లిష్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ వంటి విభాగాలను కూడా క్రమం తప్పకుండా చదవాలి. అభ్యర్థులు దరఖాస్తు తేదీలు, ఖాళీల సంఖ్య, వయోపరిమితి, విద్యార్హత, పరీక్ష తేదీలు, ఫీజు, సిలబస్ తదితర అంశాలపై అధికారిక https://www.ibps.in వెబ్‌సైట్‌లో విడుదలయ్యే పూర్తి నోటిఫికేషన్‌ను పరిశీలించాలి.