Andhra Pradesh : అతిగా ఏది తిన్నా.. అది శరీరానికి చేటు తెస్తుంది. ఉదాహరణకి రోజూ తినే అన్నాన్ని మితంగా తీసుకోవాలి అంటారు వైద్యులు. అదే అడ్డగోలుగా తింటే మధుమేహం వస్తుంది.. ఇక అనేక రకాల వ్యాధులకు కారణమవుతుంది. అందువల్లే అతి అనేది వద్దని.. మితం అనేది ముద్దని వైద్యులు చెబుతుంటారు. వైద్యులు మాత్రమే కాదు మన పెద్దలు కూడా అలానే అంటారు. ఎందుకంటే మన శరీరం అనేది జీవక్రియల ఆధారంగా ముందుకు సాగుతుంది. అతిగా ఆహారం తీసుకోవడం వల్ల జీవక్రియలు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటాయి. అవి శరీరానికి హాని కలిగిస్తాయి. ద్వారా వ్యాధులు కూడా సోకుతాయి. అందువల్ల ఏదైనా సరే ఎరుకతోనే తినాలి అంటారు పెద్దలు.
తిండి మాత్రమే కాదు.. శరీరానికి రక్షణ కల్పించి.. వ్యాధులను దూరం చేసే మందుల విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతుంటారు. ఉదాహరణకి జ్వరం వస్తే వేసుకునే గోళీలు తక్షణమే సాంత్వన కలిగిస్తాయి. అదే జ్వరం రాకుండా ఉండడానికి ముందస్తుగానే ఆ గోళీలు వేసుకుంటే ఆరోగ్యానికి చేటు తెస్తాయి. నొప్పుల గోళీలు కూడా అంతే. అదేపనిగా వాటిని వేసుకుంటే మూత్రపిండాలకు ఇబ్బంది కలిగిస్తాయి. అందువల్ల మందులు ఏవైనా సరే.. వ్యాధి సోకినప్పుడు మాత్రమే వేసుకోవాలి. అంతే తప్ప ముందస్తు జాగ్రత్తగా మందులు వేసుకుంటే రక్షణ కాదు కదా.. శరీరానికి చేటు కలుగుతుంది.
కేవలం వ్యాధుల నివారణకే కాకుండా.. కలయికలో పాల్గొనే ముందు మరింత రెచ్చిపోవడానికి.. వివాహం జరగకుండానే కలయికలో పాల్గొనడం వల్ల ఏర్పడిన అవాంచిత గర్భం తొలగించుకోవడానికి కూడా మందులు ఉన్నాయి.. కాకపోతే వీటిని వైద్యుల అనుమతితోనే వాడాలి. ఎందుకంటే ఈ మందులు విపరీతమైన ప్రభావాన్ని కలిగి ఉంటాయి.. గతంలో ఉద్దీపన మందులు వేసుకున్నవారు ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు చాలా ఉన్నాయి. అవాంచితంగా ఏర్పడిన గర్భాన్ని తొలగించుకోవడానికి మాత్రలను ఇష్టానుసారంగా ఉపయోగించడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అందువల్ల భారత వైద్య మండలి ఉద్దీపన మందులు, గర్భనిరోధ మందుల వాడకంలో కఠినమైన నిబంధనలు విధించింది. అయినప్పటికీ ఆ నిబంధనలను ఎవరూ పాటించడం లేదు. పైగా ఆ మందులను మెడికల్ షాప్ నిర్వాహకులు ఇష్టానుసారంగా విక్రయిస్తున్నారు. ఇటువంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉపయోగ గోదావరి జిల్లాల్లో ఉన్న మందుల షాపుల్లో వయాగ్రా, గర్భ నిరోధ మందుల వాడకం అడ్డగోలుగా కొనసాగుతున్నది. ముఖ్యంగా మెడికల్ షాప్ నిర్వాహకులు ఈ మందులను ఇష్టానుసారంగా అమ్ముతున్నారు. అధికారుల తనిఖీలలో ఈ దిగ్బ్రాంతి కరమైన నిజాలు వెలుగు చూసాయి..” కలయికలో పాల్గొనే ముందు మరింత సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఉపయోగించే మందులను.. గర్భాన్ని నిరోధించుకోవడానికి ఉపయోగించే మందులను ఇటీవల కాలంలో ఈ జిల్లాల్లో మెడికల్ షాప్ నిర్వాహకులు విపరీతంగా డీలర్ల నుంచి కొనుగోలు చేస్తున్నారు. వీటిపై అధికారులకు సమాచారం అందడంతో వారు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఆయా మెడికల్ షాపులలో తనిఖీలు చేశారు. అధికారులకు వచ్చిన సమాచారం.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిస్థితి ఒకే విధంగా ఉండడంతో.. వారు తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ మందులను ఇష్టానుసారంగా వాడటం వల్ల శరీరంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఈ మందులు ఆరోగ్యానికి చేటు తెస్తాయని వైద్యులు చెబుతున్నారు..” కామోద్రే కం కలగడానికి… గర్భాన్ని తొలగించుకోవడానికి వాడే మందులు ఆరోగ్యానికి అంత మంచిది కావు. వీటిని విపరీతంగా వాడితే శరీరంలో మార్పులు చోటు చేసుకుంటాయి. అవి ప్రాణాలు పోవడానికి కూడా కారణమవుతాయి. అలాంటప్పుడు వాటి వాడకంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వైద్యుల సిఫారసు లేకుండా వీటిని వాడితే ప్రమాదకరమైన పరిస్థితులను ఎదురుచూడాల్సి వస్తుందని” అధికారులు చెబుతున్నారు.