Homeటాప్ స్టోరీస్AIMIM : తెలంగాణలో కలకలం.. ఎమ్మెల్సీ ని సస్పెండ్ చేసిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్.. అసలు...

AIMIM : తెలంగాణలో కలకలం.. ఎమ్మెల్సీ ని సస్పెండ్ చేసిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్.. అసలు కథ ఇదీ

AIMIM : ఇటీవల హిజాబ్ గురించి ఒక కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. దానిపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు.. ఇది మా గౌరవంతో కోర్టు ఆట ఆడుకోవడమేనని స్పష్టం చేశారు. కోర్టు తీర్పును తాము అంగీకరించబోమని వివరించారు. ఆడవాళ్ళ పట్ల గౌరవంగా ఉండాలని నీతి సూక్తులు చెప్పారు. పైకి ఎన్ని గొప్ప మాటలు చెప్పినప్పటికీ ఓవైసీ పార్టీలో ఆడవాళ్లపై జరుగుతున్న ఆకృత్యాలు వెలుగులోకి వస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. చివరికి ఆ పార్టీకి సంబంధించిన […]

AIMIM : ఇటీవల హిజాబ్ గురించి ఒక కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. దానిపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు.. ఇది మా గౌరవంతో కోర్టు ఆట ఆడుకోవడమేనని స్పష్టం చేశారు. కోర్టు తీర్పును తాము అంగీకరించబోమని వివరించారు. ఆడవాళ్ళ పట్ల గౌరవంగా ఉండాలని నీతి సూక్తులు చెప్పారు.

పైకి ఎన్ని గొప్ప మాటలు చెప్పినప్పటికీ ఓవైసీ పార్టీలో ఆడవాళ్లపై జరుగుతున్న ఆకృత్యాలు వెలుగులోకి వస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. చివరికి ఆ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ ఒక బాలిక మీద వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఎంఐఎంలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్న మీర్జా రహమత్ బేగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.. అత్తాపూర్ ప్రాంతంలో బేగ్ ఓ బాలిక మీద చేయకూడని పనిచేస్తుండగా కొందరు యువకులు పట్టుకున్నారు. తీవ్రంగా కొట్టారు. వీడియోలు కూడా తీశారు. ఈ విషయం ఓవైసీకి ముందే తెలుసని.. అందువల్లనే బేగ్ ను ఉమ్రా పంపించారు. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి ఎటువంటి కారణం చూపించకుండానే సస్పెండ్ చేశారు.. మీర్జా రహమత్ బేగ్ పై సస్పెన్షన్ పై ఓల్డ్ సిటీ జర్నలిస్టులు స్పందిస్తున్నారు. అందులో ప్రధానంగా ఓల్డ్ సిటీ జర్నలిస్టు సయ్యద్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు..” ఓవైసీ ఎటువంటి కారణం చూపించకుండానే తన పార్టీ ఎమ్మెల్సీని సస్పెండ్ చేశారు. దీని వెనక ఒక బలమైన కారణం ఉంది. ఆ ఎమ్మెల్సీ దారుణం చేశాడు. అందువల్లే ఓవైసీ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నీతి వాక్యాలు పైకి చెబుతారు. లోపల మాత్రం ఇటువంటి వ్యవహారాలకు పాల్పడుతుంటారని” సయ్యద్ సబ్దర్ అలీ వివరించారు.

రహమత్ బేగ్ ను ఎంఐఎం పార్టీ బహిష్కరించింది. వెంటనే శాసనమండలి చైర్మన్ కు తన రాజీనామా సమర్పించాలని ఎంఐఎం జాయింట్ సెక్రెటరీ అన్వర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ఎమ్మెల్సీ అకృత్యాల గురించి హైదరాబాద్ సిటీ మొత్తం తెలియాలని.. అతడిని ఎంఐఎం నుంచి ఎందుకు బహిష్కరించారో ఓవైసీ తన నోటి ద్వారా చెప్పాలని.. ఈ కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే.. ఎంఐఎం కార్పొరేటర్ కూడా ఉన్నారని.. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని.. ఓవైసీ ఏమో హిజాబ్ గురించి చెబుతుంటారని.. ఆడవాళ్ళతో గౌరవంగా ఉండాలని అంటారని.. వాళ్లేమో ఇలా ఆడవాళ్ళ మీద అసభ్యంగా ప్రవర్తిస్తుంటారని.. నా దగ్గర మొత్తం ఆధారాలు ఉన్నాయని.. ముందు ఉంచుతానని.. ఆడవాళ్ళ మీద వాళ్ళ పార్టీ నాయకులు చేస్తున్న అకృత్యాలను ఆయన చెప్పాలని హెచ్ వైసీ నాయకుడు సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తద్వారా ఈ పరిణామం ఎక్కడిదాకా దారి తీస్తుందో చూడాల్సి ఉంది. అయితే దీనిపై ఇప్పటివరకు పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు రాలేదు. ఒకవేళ కోర్టు సుమోటోగా తీసుకొని ఈ కేసును గనుక విచారణకు తీసుకుంటే.. అప్పుడు ఎంఐఎం ఎమ్మెల్సీ మీద కోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper