Fasting: ప్రస్తుత కాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు మనుషులు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు జంక్ ఫుడ్, రోస్ట్ ఫుడ్ తింటూనే మరోవైపు ఆరోగ్యంగా ఉండేందుకు ఆసుపత్రుల వెంట తిరుగుతున్నారు. ఈ కాలంలో ఎక్కువమంది బరువు సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ఈ బరువు తగ్గడానికి ప్రతిరోజు వ్యాయామాలు చేస్తూ కష్టపడుతున్నారు. మరికొందరు క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తూ చెమటలను చిందిస్తున్నారు. కానీ ఉపవాసం ఉండడానికి మాత్రం ఎవరూ ఇష్టపడడం లేదు. ఎందుకంటే ఉపవాసం ఉండడం వల్ల కడుపు ఖాళీగా ఉండి అనేక రకాల సమస్యలు ఉంటాయని కొందరు చెబుతుంటారు. మరికొందరు మాత్రం ఆహారం మీద ఉన్న ప్రీతితో ఒక్కరోజు కూడా తినకుండా ఉండలేరు. అయితే మాంసాహారం తినే పులి, చిరుత పులిలు ఉపవాసం పై ఒక నీతి చెబుతుంటాయి. అది ఏంటంటే..?
Also Read: రేవంత్ శత్రువును చంపలేదు.. ఓడించాడు
పులి, చిరుత పులి లు మాంసాహారులు అని అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఏదైనా ఒక జంతువు కనిపిస్తే దానిని వెంటనే తినకుండా ఉండలేదు. పులి అయితే పంజా విసిరితే ఆహారం తన సొంతం కావాల్సిందే. ఒక్క సారి పులి 25 కిలోల మాంసాహారం తింటూ ఉంటుందని కొన్ని లెక్కలు చెబుతుంటాయి. మరి ఇంత పెద్ద మొత్తంలో తిన్న పులి, చిరుత పులి లు ఎందుకు యాక్టివ్ గా ఉంటాయి? వాటికి ఎటువంటి ఫ్యాట్ ఎందుకు రాదు? అవి ఎందుకు ఎక్కువగా బరువు పెరగవు?
అందుకు పెద్ద కారణమే ఉంది. అది ఏంటంటే? పులులు ఒక్కసారి ఒక ఆహారం తీసుకుంటే.. మరోసారి ఆహారం తీసుకోవడానికి నాలుగు లేదా ఐదు రోజుల సమయం పడుతుంది. అంటే ఒకసారి 25 కిలోల ఆహారాన్ని తీసుకుంటే.. ఐదు రోజుల వరకు ఎటువంటి ఆహారాన్ని ముట్టదు. మరో జంతువు వైపు చూడకుండా ఉంటుంది. అయితే పులులు తమకు పంజా విసిరే శక్తి లేకపోవడం కాదు.. అలాగే వాటికి ఆహారం దొరక లేకపోవడం కాదు.. అవి ఈ ఐదు రోజులపాటు ఉపవాసం చేస్తాయి. అంటే ఒకసారి తీసుకున్న ఆహారం ఐదు రోజుల వరకు ఉపవాసం ఉండడంతో ఈ ఆహారం మెల్లిగా జీర్ణం అవుతుంది. అలా ఆహారం జీర్ణం అవుతూ శరీరానికి శక్తిని అందిస్తుంది.
ఇలా పులులు ఒకసారి ఆహారం తీసుకుంటే ఐదు రోజుల వరకు ఉపవాసం ఉన్నట్లే.. మనుషులు కూడా ఒకరోజు మాంసాహారం తినగలిగినప్పుడు మరొక రోజు ఉపవాసం చేయడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఎందుకంటే ఒకరోజు మాంసాహారం తీసుకున్న తర్వాత అది పూర్తిగా డైజెషన్ కావడానికి మరొక రోజు పడుతుంది. ఇలా క్రమ పద్ధతిలో ఆహారం విషయంలో ఉపవాసం ఉంటూ.. ఆహారాన్ని తగ్గించడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. అయితే చాలామంది మూడుపూటలా మాంసాహారం తింటూ ఉంటారు. అలాగే రోజుల తరబడి మాంసాహారం తింటుంటారు. ఇలా చేయడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది. ఈ సమస్యలు పరిష్కరించడానికి పూర్వకాలంలో పెద్దలు ఉపవాసం అనే నిబంధన పెట్టారు. ఆరోగ్యాన్ని కాపాడాలని అనుకునే వారు కూడా ఇలాంటి ఉపవాసాలు చేయడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతారు.