Sankatahara Chaturthy: అది దేవుడిగా పిలిచే వినాయకుడి పూజ చేసిన తర్వాతే ఏ పూజ అయినా.. కార్యక్రమ అయినా ప్రారంభిస్తారు. ప్రతి ఏడాది వినాయక చవితి సందర్భంగా వారం రోజులపాటు వాడవాడలా గణనాథుడు కొలువై ఉంటారు. అయినా ప్రతిరోజు వినాయకుడి పూజ లేనిదే ఏ పూజను ప్రారంభించారు. అయితే వినాయకుడి అనుగ్రహం మరింత పొందాలని అనుకునేవారు ఆ స్వామి కోసం ఒకరోజు ప్రత్యేకంగా కేటాయించి.. ఉపవాసం ఉండడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయని భక్తులు చెబుతున్నారు.. ఆరోజు సంకటహర చతుర్థి. ప్రతి నెలలో Sankatahara Chaturthy రోజున విగ్నేశ్వరుడని కొలవడంతోపాటు ఉపవాసం ఉండడం వల్ల జీవితం ఆనందమయంగా మారుతుందని.. అనుకున్న పనులు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. అయితే సంకటహర చతుర్థి రోజు ఎలాంటి పూజలు చేయాలి..? ఉపవాసం ఉంటూ ఏం చేయాలి..? అనే వివరాల్లోకి వెళ్దాం..
హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి చంద్ర మాసంలో వచ్చే పౌర్ణమి తర్వాతి నాలుగవ రోజున Sankatahara Chaturthyని జరుపుకుంటారు. సంకటహర చతుర్థి రోజులలో అంగారకి సంకటార చతుర్థి ముఖ్యమైన రోజుగా చెప్పుకుంటారు. ఈ రోజున కఠిన నియమాలతో ఉపవాసం ఉండి స్వామివారికి ప్రత్యేక పూజలు చేయడం వలన విశేష ఫలితాలు పొందుతారని పండితులు చెబుతున్నారు. అయితే ఈ రోజున ఎలాంటి నియమాలు పాటించాలి..?
Sankatahara Chaturthy రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. ఆ తర్వాత చేతిలో నీటితో పూజలు చేయాలి. స్వామివారికి నువ్వు లడ్డూలు, మోదకాలు సమర్పించాలి. గణపతి పూజ పూర్తయిన తర్వాత ప్రశాంతంగా ఉండాలి. ఈరోజు సాయంత్రం వరకు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవద్దు. సాయంత్రం చంద్రోదయం తర్వాత మాత్రమే సాత్విక ఆహారం తీసుకోవాలి. సంకటహర చతుర్థి రోజున గణపతికి పూజలు చేయడంతో పాటు నెయ్యి, దుస్తులు నువ్వులతో చేసిన వస్తువులను దానం చేయడం వల్ల పుణ్యఫలం ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం ఉపవాస దీక్ష వీడియో సమయంలో పెద్దల ఆశీస్సులు తీసుకోవడం మంచిది.
అయితే సంకటహర చతుర్థి రోజు ప్రత్యేక పూజలు చేయడంతో పాటు కొన్ని తప్పులు, పొరపాట్లు చేయకుండా కూడా ఉండాలి. ఈరోజు సూర్యోదయం అయిన తర్వాత కూడా నిద్రించకుండా ఉండాలి. స్నానం చేయకుండా ఆహారాన్ని తీసుకోకూడదు. ఉపవాస దీక్ష చేపట్టిన వారు పగటిపూట నిద్రించకుండా ఉండాలి. ఎదుటివారితో వాదనలకు దిగకుండా ఉండాలి. పరుష వాక్యాలు చేయకుండా ప్రశాంతంగా రోజును గడపాలి.
2025 కొత్త సంవత్సరం ఏర్పడిన తర్వాత జనవరిలో 17వ తేదీన Sankatahara Chaturthy నీ జరుపుకుంటారు. ఈరోజు ఉదయం 4.6 గంటలకు తిథి ప్రారంభమై 18 జనవరి ఉదయం 5.30 గంటలకు పూర్తవుతుంది. ఈ సమయం వరకు గణపతి దేవుడిని పూజిస్తూ ఉండాలి. నిద్రించే సమయంలో కూడా ప్రశాంతమైన పరిశుభ్రమైన, వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మొదటిసారి సంకటహర చతుర్థి ఉపవాస దీక్ష చేయాలని అనుకునేవారు మంగళవారం రోజున వచ్చే చతుర్థి రోజున ప్రారంభించాలి. ఉపవాస దీక్షలు కనీసం 11 వారాలపాటు చేయాలని కొందరు పండితులు చెబుతున్నారు. ఈ ఉపవాస దీక్షలు విడిచి పెట్టేవారు స్థానిక వినాయకుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. ఆ తర్వాత ఉపవాస దీక్షలను విడిచిపెట్టాలి..