Homeఎంటర్టైన్మెంట్Lenin Movie : 'మా ఇంటి బంగారం' మొదటి రోజు వసూళ్లను 'లెనిన్' అందుకోగలదా..? అక్కినేని...

Lenin Movie : ‘మా ఇంటి బంగారం’ మొదటి రోజు వసూళ్లను ‘లెనిన్’ అందుకోగలదా..? అక్కినేని ఫ్యామిలీ కి అతి పెద్ద సవాల్..

Lenin Movie : మరికొద్ది గంటల్లో అక్కినేని అఖిల్ హీరో గా నటించిన ‘లెనిన్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాపై అభిమానుల్లోనే కాదు , ప్రేక్షకుల్లో కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. కానీ అఖిల్ గత చిత్రాల ప్రభావం కారణం గా టాక్ బాగుంటే థియేటర్ కి కదులుదాం అనే మూడ్ లో ఉన్నారు ప్రేక్షకులు. అందుకే అడ్వాన్స్ బుకింగ్స్ చాలా వీక్ గా ఉన్నాయి. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి ఇప్పటి […]

Lenin Movie : మరికొద్ది గంటల్లో అక్కినేని అఖిల్ హీరో గా నటించిన ‘లెనిన్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాపై అభిమానుల్లోనే కాదు , ప్రేక్షకుల్లో కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. కానీ అఖిల్ గత చిత్రాల ప్రభావం కారణం గా టాక్ బాగుంటే థియేటర్ కి కదులుదాం అనే మూడ్ లో ఉన్నారు ప్రేక్షకులు. అందుకే అడ్వాన్స్ బుకింగ్స్ చాలా వీక్ గా ఉన్నాయి. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి ఇప్పటి వరకు ఆన్లైన్ ట్రాకింగ్ సిస్టం ద్వారా కేవలం 3 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే నమోదు అయ్యాయి. ఇది చాలా అంటే చాలా తక్కువ అనే చెప్పాలి. అయితే అక్కినేని అఖిల్ ముందు ఇప్పుడు ఉన్నటువంటి అతి పెద్ద సవాల్ ‘మా ఇంటి బంగారం’. సమంత ప్రధాన పాత్ర పోషించిన ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రం సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది.

తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ అయితే రాలేదు కానీ , ఓవర్సీస్ , రెస్ట్ ఆఫ్ ఇండియా లో మాత్రం దుమ్ము లేచిపోయే రేంజ్ ఓపెనింగ్ ని సొంతం చేసుకుంది. ఓవరాల్ గా ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజున 13 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 6 కోట్ల 16 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ‘లెనిన్’ చిత్రానికి ఈ రేంజ్ షేర్ వసూళ్లను రాబట్టే ఛాన్స్ ఉందా అంటే ప్రస్తుతానికి అనుమానమే. ఈ బుకింగ్స్ తో ఆ రేంజ్ ఓపెనింగ్స్ వస్తాయని కచ్చితంగా చెప్పలేము , కానీ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ‘మా ఇంటి బంగారం’ ఓపెనింగ్స్ కి చాలా దగ్గరగా వెళ్లొచ్చు, అంతే కానీ పూర్తిగా ఆ ఓపెనింగ్స్ ని బీట్ చేయడం మాత్రం అసాధ్యమే.

ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే ‘లెనిన్’ చిత్రం తెలుగు రాష్ట్రాల నుండి 3 నుండి 4 కోట్ల రూపాయిల రేంజ్ లో షేర్ వసూళ్లను అందుకునే అవకాశం ఉంది. కానీ ఓవర్సీస్ లో కోటి నుండి రెండు కోట్ల మధ్యలోనే గ్రాస్ వసూళ్లు వస్తాయి. అంటే షేర్ వసూళ్లు కేవలం కోటి రూపాయిలు మాత్రమే , ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా వసూళ్లను కూడా కలుపుకుంటే ఈ చిత్రానికి 5 నుండి 6 కోట్ల రూపాయిల మధ్యలో షేర్ వసూళ్లు వస్తాయని అంచనా. ఇది కేవలం పాజిటివ్ టాక్ వస్తేనే, ఒకవేళ టాక్ రాకపోతే , ఇంతకంటే తక్కువ వసూళ్లు నమోదు అవుతాయి. అప్పుడు సోషల్ మీడియా లో ఈ చిత్రం పై ట్రోల్స్ మామూలు రేంజ్ లో ఉండవనే చెప్పాలి , చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper