Homeఎంటర్టైన్మెంట్Thaman : 'లెనిన్' టీం పై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఫైర్.. సంచలనం రేపుతున్న వీడియో..

Thaman : ‘లెనిన్’ టీం పై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఫైర్.. సంచలనం రేపుతున్న వీడియో..

Thaman : మన టాలీవుడ్ లో ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్స్ లో తమన్ కి ఉన్నంత క్రేజ్ , ఎవరికీ లేదు అనడంలో అతి సయోక్తి లేదు. ప్రతీ శుక్రవారం విడుదలయ్యే సినిమాకు తమన్ సంగీతం ఉంటుంది. రీసెంట్ గా ఆయన సంగీత దర్శకత్వం వహించిన చిత్రం ‘లెనిన్’. అక్కినేని అఖిల్ హీరో గా నటించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై బ్లాక్ బస్టర్ గా నిల్చింది. అంతే కాకుండా ఈ ఏడాది అత్యధిక […]

Thaman : మన టాలీవుడ్ లో ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్స్ లో తమన్ కి ఉన్నంత క్రేజ్ , ఎవరికీ లేదు అనడంలో అతి సయోక్తి లేదు. ప్రతీ శుక్రవారం విడుదలయ్యే సినిమాకు తమన్ సంగీతం ఉంటుంది. రీసెంట్ గా ఆయన సంగీత దర్శకత్వం వహించిన చిత్రం ‘లెనిన్’. అక్కినేని అఖిల్ హీరో గా నటించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై బ్లాక్ బస్టర్ గా నిల్చింది. అంతే కాకుండా ఈ ఏడాది అత్యధిక లాభలను రాబట్టిన టాప్ 5 సినిమాల్లో ఒకటిగా నిల్చింది ఈ చిత్రం. ఈ సినిమాలో అఖిల్ తో పాటు ఇతర నటీనటుల నటన ఎంత హైలైట్ అయ్యిందో , సంగీత దర్శకుడు తమన్ అందించిన మ్యూజిక్ కూడా అంతే హైలైట్ అయ్యింది. ముఖ్యంగా ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ చిత్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లింది.

అయితే ఈ మూవీ టీం పై తమన్ తీవ్ర స్థాయిలో కోపం తెచ్చుకున్నారట. ఆ కోపం తో ఆయన మూవీ టీం క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్స్ అన్నిటి నుండి లెఫ్ట్ అయిపోయాడట. ఆయన మాట్లాడుతూ ‘ ఈ చిత్రం లో ఒక మంచి మాస్ బీట్ ఉన్న ఐటెం సాంగ్ ని కంపోజ్ చేశాను. ఆ సాంగ్ చాలా అద్భుతంగా వచ్చింది. చాలా భారీ గా ఈ పాటని చిత్రీకరించాలని అనుకున్నారు. అందుకోసం ప్రీతీ ముకుందన్ , రష్మిక మందాన , పూజ హెగ్డే వంటి వారిని కూడా సంప్రదించారు. కానీ సినిమా కథకు ఆ ఐటెం సాంగ్ సరిగా ఫిట్ అవ్వడం లేదు. స్టోరీ ఫ్లో కి స్పీడ్ బ్రేకర్ లాగా ఉంటుందనే ఉద్దేశ్యం తో ఆ పాటని తొలగించారు. నాకు పట్టరాని కోపం వచ్చింది. దాన్ని ఎలా వ్యక్తం చెయ్యాలో అర్థం కాక , లెనిన్ మూవీ వాట్సాప్ గ్రూప్స్ నుండి లెఫ్ట్ అయిపోయాను ‘ అంటూ చెప్పుకొచ్చారు తమన్.

అందుకు సంబంధించిన వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. అయితే ఈమధ్య కాలం లో సినిమాల్లో పాటలకు ప్రాధాన్యత బాగా తగ్గిపోయింది. మాస్ కమర్షియల్ సినిమాల్లో కూడా అవసరం అయితేనే పాటలు పెడుతున్నారు , లేదంటే ఒకటి రెండు పాటలతోనే సరిపెడుతున్నారు. ఇప్పుడు ‘లెనిన్’ విషయం లో కూడా అదే జరిగింది. అయితే ఈ పాటని ఎలాగో థియేట్రికల్ వెర్షన్ లో విడుదల చేయలేదు కదా, కనీసం ఓటీటీ వెర్షన్ లో అయినా విడుదల చేయాల్సిందిగా అభిమానులు కోరుతున్నారు. అది కూడా కుదరకపోతే , కనీసం యూట్యూబ్ లో అయినా విడుదల చెయ్యాలని రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper