Akhil Rajamouli Story: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో వరుస సక్సెస్ లను సాధిస్తున్న ఏకైక దర్శకుడు రాజమౌళి… ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ప్రేక్షకులందరిని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడంలో రాజమౌళి ప్రతిసారి సక్సెస్ అవుతూనే ఉన్నాడు. అలాంటి రాజమౌళి ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత మరో సినిమా గురించి ఆలోచిస్తాడు అంతే తప్ప ఈ మూవీ సెట్స్ మీద ఉండగానే ఇతర దర్శకుల మాదిరిగా మరో సినిమా గురించి ఆయన ప్రస్తావించే ప్రసక్తే లేదంటూ ఆయన చాలాసార్లు క్లారిటీ ఇచ్చాడు. ఇక ఇదిలా ఉంటే అక్కినేని ఫ్యామిలీ కి రాజమౌళి ఫ్యామిలీ తో చాలా మంచి రిలేషన్ షిప్ ఉంది. రాజమౌళి కొడుకు అయిన కార్తికేయ, అక్కినేని అఖిల్ ఇద్దరు చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ అఖిల్ చాలా సందర్భాల్లో చెప్పాడు.
చిన్నతనంలో అఖిల్ చాలాసార్లు రాజమౌళి వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడినని చెప్పడం విశేషం… ఇక ఇదిలా ఉంటే ఒక సందర్భంలో అఖిల్ రాజమౌళి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు రాజమౌళి వర్క్ చేసుకుంటూ ఉంటే కార్తికేయ, అఖిల్ ఆటలాడుకుంటూ అల్లరి అల్లరి చేశారట.
అప్పుడు రాజమౌళి అఖిల్ కి కార్తికేయ ఇద్దరికీ కలిపి బయటికి వెళ్లి ఆడుకోండి ఇక్కడ వర్క్ చేసుకుంటున్నాను అంటూ వాళ్ల మీద కొంత వరకు సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక ఆ తర్వాత మళ్లీ అఖిల్ ని కార్తికేయను పిలిచి వాళ్ళతో రాజమౌళి కూడా కొద్దిసేపు ఆడుకున్నట్టుగా కూడా కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా జక్కన్న వర్క్ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటాడు. తనకు ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే వారిని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తాడు. తప్ప తను వర్క్ నుంచి మాత్రం డివియెట్ అయ్యే ప్రసక్తే లేదంటూ పలు సందర్భాల్లో తన క్లారిటి ఇచ్చాడు…