Lenin 100 Crore Gross: అక్కినేని అభిమానులు సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు ‘లెనిన్’ చిత్రం తెరదించింది. ఇండస్ట్రీ లోకి అఖిల్ అడుగుపెట్టి దాదాపుగా 12 ఏళ్ళు అయ్యింది. భారీ అంచనాల నడుమ , కచ్చితంగా సూపర్ స్టార్ అవుతారు అనే ఆశలతో ఇండస్ట్రీ లోకి వచ్చిన అఖిల్ , ఒక్కటంటే ఒక్క క్లీన్ హిట్ ని అందుకోవడం కోసం ఆయన పడే ఇబ్బందిని చూసి అక్కినేని ఫ్యాన్స్ చలించిపోయారు. ఆయన మీద దాదాపుగా ఆశలు వదిలేసుకుంటున్న సమయం లో విడుదలైన ‘లెనిన్’ చిత్రం అఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. కేవలం 3 రోజుల్లోనే క్లీన్ హిట్ స్టేటస్ ని సొంతం చేసుకొని అక్కినేని ఫ్యాన్స్ కి మర్చిపోలేని తీపి జ్ఞాపకం గా మిగిలింది లెనిన్ చిత్రం. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది , కానీ ఈ సినిమా కీలకమైన మైల్ స్టోన్ 100 కోట్ల గ్రాస్ ని మాత్రం అందుకోలేకపోయింది.
అందుకు కారణం రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్సీస్ లో భారీ వసూళ్లను రాబట్టలేకపోవడం వల్లే. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే ఈ చిత్రానికి 20 రోజులకు గానూ తెలుగు రాష్ట్రాల నుండి 31 కోట్ల 53 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, 54 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చిందని, కానీ ఓవర్సీస్ + రెస్ట్ ఆఫ్ ఇండియా + కర్ణాటక రాష్ట్రాలకు కలిపి కేవలం 7 కోట్ల రూపాయిల షేర్ , 17 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చిందని , అందుకే అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేదని , ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 38 కోట్ల 53 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 71 కోట్ల 65 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
కానీ మేకర్స్ మాత్రం ఈ చిత్రానికి 100 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు కాసేపటి క్రితమే ఒక పోస్టర్ ని విడుదల చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో చర్చనీయాంశంగా మారింది. ఈమధ్య కాలం లో నిర్మాతలు అభిమానుల ఆనందం కోసం, మరింత ప్రేక్షకులను ఆకర్షించడం కోసం వచ్చిన గ్రాస్ కంటే ఎక్కువ చూపిస్తూ ప్రచారం చేసుకోవడం సర్వ సాధారణం అయిపోయింది. అలా ‘లెనిన్’ చిత్రానికి కూడా చేసారని అంటున్నారు. అయితే వచ్చిన గ్రాస్ కి కేవలం 10 నుండి 20 కోట్ల మధ్యలో గ్రాస్ ఎక్కువగా చూపిస్తారని అంతా అనుకున్నారు కానీ , ఇక్కడ ఏకంగా 30 కోట్ల గ్రాస్ తేడా చూపించారు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం.