Homeఆంధ్రప్రదేశ్‌Vizag Steel Plant accident : వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీలో ఏం జరిగింది.. 8 మంది...

Vizag Steel Plant accident : వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీలో ఏం జరిగింది.. 8 మంది చనిపోవడానికి కారణం అదేనా..

Vizag Steel Plant accident : విశాఖపట్నం కేంద్రంగా కార్యకలాపాలు సాగించే విశాఖ ఉక్కు కర్మాగారం లో దారుణం చోటు చేసుకుంది. సోమవారం కర్మాగారం ప్రాంతంలో ఘోరమైన ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 8 మంది చనిపోయారు.. మొదట్లో కార్మికులకు గాయాలు మాత్రమే అయ్యాయని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారని ఫ్యాక్టరీ వర్గాలు చెబుతున్నాయి. విశాఖ ఉక్కు కర్మగారంలో స్టీల్ మెల్టింగ్ స్టేషన్ లు ఉంటాయి.. ఇక్కడ మరుగుతున్న లిక్విడ్ మీద […]

Vizag Steel Plant accident : విశాఖపట్నం కేంద్రంగా కార్యకలాపాలు సాగించే విశాఖ ఉక్కు కర్మాగారం లో దారుణం చోటు చేసుకుంది. సోమవారం కర్మాగారం ప్రాంతంలో ఘోరమైన ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 8 మంది చనిపోయారు.. మొదట్లో కార్మికులకు గాయాలు మాత్రమే అయ్యాయని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారని ఫ్యాక్టరీ వర్గాలు చెబుతున్నాయి.

విశాఖ ఉక్కు కర్మగారంలో స్టీల్ మెల్టింగ్ స్టేషన్ లు ఉంటాయి.. ఇక్కడ మరుగుతున్న లిక్విడ్ మీద పడి కార్మికులు గాయపడ్డారు. స్టీల్ మెల్టింగ్ స్టేషన్ 2 లో ఈ సంఘటన చోటుచేసుకుంది. కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వేల డిగ్రీల టెంపరేచర్ గా ఉండే లిక్విడ్ మీద పడి పదిమంది కార్మికులు గాయపడ్డారు. మొదట్లో గాయాలు అని మాత్రమే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అందులో 8 మంది కార్మికులు చనిపోయారని తెలుస్తోంది. లిక్విడ్ మీద పడడంతో కార్మికుల దేహాలు చిద్రంగా మారిపోయాయి. ఆ దృశ్యాలు కూడా అత్యంత హృదయ విదారకంగా ఉన్నాయి.

స్టీల్ మెల్టింగ్ స్టేషన్ లో వేల డిగ్రీల టెంపరేచర్ వద్ద ద్రవ రూపంలో ఉన్న ఇనుమును రకరకాల ఆకృతులలో మార్చుతుంటారు. ఇక్కడే వైజాగ్ స్టీల్ తయారవుతూ ఉంటుంది. డిమాండ్ కు అనుగుణంగా బార్ లు తయారుచేస్తారు. అయితే ఇక్కడ ఏం జరిగిందో తెలియదు. మీడియాలో మాత్రం సాంకేతికపరమైన లోపాల వల్ల ఇలా జరిగిందని వార్తలు వస్తున్నాయి. వేల డిగ్రీల టెంపరేచర్ ఉండే ఆ ద్రవం కార్మికుల మీద పడింది. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు.

వేల డిగ్రీల టెంపరేచర్ ఉండే ద్రవం మీద పడడంతో కార్మికులు తీవ్రంగా గాయపడి చనిపోయారు. వారి శరీరాల మీద తీవ్రంగా గాయాలయ్యాయి. కార్మికులు నెత్తుటి మడుగులో ఉండడంతో.. ఆ ప్రాంతం మొత్తం శవాలదిబ్బగా ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకుంటామని పేర్కొన్నారు. గాయపడిన వారికి సత్వరమే అత్యాధునిక వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. విశాఖపట్నం ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper