Talented Heroes: సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు చేసే సినిమాల విషయంలో ఎంతవరకు జాగ్రత్తలు తీసుకున్నా కూడా సక్సెసు లైతే రావడం లేదు. ప్రస్తుతం ఆ హీరోల నుంచి సినిమాలు వచ్చినప్పుడు మాత్రం ఫ్లాప్ చేస్తున్నారు. ఆ తర్వాత కల్ట్ క్లాసిక్ అంటూ ప్రేక్షకులు ఆ సినిమాలను టివి లో రిపీటెడ్ గా చూడడానికి ఇష్టపడుతున్నారు. థియేటర్లో సక్సెస్ కానీ సినిమాతో ఆయా హీరోలు ఏమాత్రం మార్కెట్ ని క్రియేట్ చేసుకోలేకపోతున్నారు. దానివల్ల వల్ల తో సినిమాలా చేయడానికి స్టార్ డైరెక్టర్లు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇక వాళ్ళని చూసిన చాలా మంది ప్రేక్షకులు ఆ హీరోలకు టాలెంట్ ఉంది కానీ లక్కు మాత్రం లేదు అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. టాలెంట్ ఉండి లక్కు లేని హీరోల్లో గోపీచంద్ మొదటి స్థానంలో ఉంటాడు. ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. అలాగే తన నటన కూడా అద్భుతంగా ఉంటుంది. సాహసం సినిమాలో డిఫరెంట్ గా నటించి మెప్పించినప్పటికి ఆమోవీ అనుకున్న రేంజ్ లో సక్సెస్ ను సాధించలేదు.
గౌతమ్ నంద లాంటి సినిమాలో విలన్ గా కూడా నటించి మెప్పించాడు. కెరియర్ స్టార్టింగ్ లో విలన్ గానే తన కెరియర్ ను మొదలు పెట్టినప్పటికి ఆ తర్వాత హీరోగా మారి మొత్తానికైతే స్టార్ హీరో రేంజ్ ను టచ్ చేసే కథలను సెలెక్ట్ చేసుకున్నప్పటికి ఆ సినిమాలు అతనికి పర్ఫెక్ట్ గా సెట్ కావడం లేదు సక్సెస్ లైతే రావడం లేదు…
ఇక సత్యదేవ్ లాంటి నటుడు కూడా డిఫరెంట్ సినిమాలను చేస్తున్నాడు ప్రేక్షకులందరిలో నటుడి గా గొప్ప గుర్తింపు సంపాదించుకున్నప్పటికి ఆయన చేసే సినిమాలు ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోతున్నాయి. నటన పరంగా ప్రేక్షకుల్లో అమితమైన గౌరవాన్ని సంపాదించుకున్న ఆయన సక్సెస్ ను మాత్రం సాధించలేకపోతున్నాడు. తన కంటెంట్ లో దమ్మున్నప్పటికి ప్రేక్షకులు ఎందుకని ఆ సినిమాను రిసీవ్ చేసుకోలేకపోతున్నారనే విషయం ఇప్పటికి తనకు అర్థం కావడం లేదంటూ ఆయన వాపోతున్నాడు…
సందీప్ కిషన్ లాంటి నటుడు సైతం ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు దాటినా కూడా అతను చెప్పుకోడానికి ఒక సాలిడ్ సక్సెస్ అయితే లేదు.ఆయన సినిమాలు అడపదడపా ఆడుతున్నాయి తప్ప భారీ విజయాలను నమోదు చేయడం లేదు. తను కూడా వైవిద్య భరితమైన నటనను చూపించడంలో ఆయన ముందు వరుసలో ఉంటాడు…