Homeఎంటర్టైన్మెంట్Peddi Release Date : ఇలా అయితే కష్టమే..'పెద్ది ' మూవీ షూటింగ్ ఎంత బ్యాలన్స్...

Peddi Release Date : ఇలా అయితే కష్టమే..’పెద్ది ‘ మూవీ షూటింగ్ ఎంత బ్యాలన్స్ ఉందో తెలుసా!

Peddi Release Date : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) ప్రస్తుతం చేస్తున్న ‘పెద్ది'(Peddi Movie) చిత్రం పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు సాధారణమైనవి కావు. ఎందుకంటే ఈ చిత్రం నుండి విడుదలైన గ్లింప్స్ వీడియో కి, అదే విధంగా గత ఏడాది నవంబర్ నెలలో ఈ చిత్రం నుండి విడుదలైన ‘చికిరి..చికిరి’ పాటకు ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ‘చికిరి’ పాటకు అయితే యూట్యూబ్ లో అన్ని […]

Peddi Release Date : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) ప్రస్తుతం చేస్తున్న ‘పెద్ది'(Peddi Movie) చిత్రం పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు సాధారణమైనవి కావు. ఎందుకంటే ఈ చిత్రం నుండి విడుదలైన గ్లింప్స్ వీడియో కి, అదే విధంగా గత ఏడాది నవంబర్ నెలలో ఈ చిత్రం నుండి విడుదలైన ‘చికిరి..చికిరి’ పాటకు ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ‘చికిరి’ పాటకు అయితే యూట్యూబ్ లో అన్ని భాషలకు కలిపి 200 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో కచ్చితంగా ఈ సినిమాలో ఎదో గొప్ప విషయం ఉంది, రామ్ చరణ్ మరోసారి ‘రంగస్థలం’ రేంజ్ బ్లాక్ బస్టర్ ని అందుకోబోతున్నాడు, అది కూడా ఆయన పుట్టినరోజు నాడు, మార్చి 27 న జరగబోతుంది అంటూ అభిమానులు చాలా గర్వంగా చెప్పుకొచ్చారు. కానీ ఈ సినిమా మార్చి 27 న విడుదల అవ్వడం అసాధ్యమని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్.

పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి, ఇంకా 30 రోజులకు పైగా డేట్స్ అవసరం ఉందట. రామ్ చరణ్ ఈ భారీ షెడ్యూల్ కోసం తన శరీరాన్ని ఎలా మార్చుకున్నాడో ఈరోజు ఉదయం ఆయన తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఫోటోలను చూసి అర్థం చేసుకోవచ్చు. ఈ 30 రోజుల షూటింగ్ ని పూర్తి చేసుకొని , ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి కావాల్సిన సమయం మార్చి 27 న విడుదలకు సరిపోదని, కచ్చితంగా పోస్ట్ ప్రొడక్షన్ కి మూడు నెలల సమయం పడుతుందని, కాబట్టి ఈ చిత్రం వాయిదా పడేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ వాయిదా పడితే, దసరా వరకు అభిమానులు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో చూడాలి.

మరో పక్క ఈ చిత్రం నుండి రెండవ పాట విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ పాట రావొచ్చు. అంతే కాకుండా రీసెంట్ గా రామ్ చరణ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో కూడా ‘పెద్ది’ ని మార్చి 27 న విడుదల చేయబోతున్నట్టు చెప్పుకొచ్చాడు. మూవీ టీం విడుదల తేదీ లో ఎలాంటి మార్పు లేదని అంటూనే ఉన్నారు కానీ, పరిస్థితులు చూస్తే అలా అనిపించడం లేదు. ఒకవేళ ఈ సినిమా వాయిదా పడితే, మార్చి 27 న పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం విడుదల అయ్యేందుకు సిద్ధం గా ఉంది. ఓజీ చిత్రం తో సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కినా మెగా ఫ్యామిలి, ‘మన శంకర వరప్రసాద్ గారు’ సక్సెస్ తో తారా స్థాయికి వెళ్ళింది. ఈ సక్సెస్ జోరుని పెద్ది కొనసాగిస్తుందా?, లేదా ఉస్తాద్ భగత్ సింగ్ కొనసాగిస్తుందా అనేది చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper