Peddi Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియాలో సైతం తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నాడు. ఇప్పటివరకు తను సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో మరింత ముందుకు దూసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ సంవత్సరం ఇప్పటికే పెద్ది సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఈ మూవీ అనుకున్న మేరకు సక్సెస్ సాధించలేదు. దాంతో రామ్ చరణ్ మార్కెట్ కొంతవరకు డౌన్ అయిందనే చెప్పాలి. మొత్తానికైతే ఈ సినిమా మీద చాలా మంది చాలా రకాల విమర్శలు చేశారు. రీసెంట్ గా స్టార్ రైటర్ అయిన పరుచూరి గోపాలకృష్ణ సైతం ఈ సినిమా మీద తన విశ్లేషణను తెలియజేశాడు. ఇలాంటి మాస్ హీరోను పెట్టుకొని బ్యాక్ టు బ్యాక్ అటు క్రికెట్ లో ఫెయిల్ అవ్వడం, ఇటు కుస్తీ ఫైట్ లో కాలు పనిచేయపోవడం వల్ల పోటీలో పాల్గొనకపోవడం అనేది మాస్ ప్రేక్షకులను విపరీతంగా నిరాశపరిచే అంశమనే చెప్పాలి.
అక్కడే సినిమా రాంగ్ స్టెప్ తీసుకుంది అంటూ ఆయన డైరెక్టర్ ను ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశాడు. ఇక ఏది ఏమైనా కూడా పరుచూరి గోపాలకృష్ణ చెప్పినట్టుగా మాస్ ప్రేక్షకులు రామ్ చరణ్ లోని మాస్ యాంగిల్ చూడ్డానికి థియేటర్ కి వస్తుంటారు.
కానీ ఒక ఆర్ట్ సినిమా లాగా దాన్ని తీర్చి దిద్దితే వాళ్లు మాత్రం ఎలా జీర్ణించుకుంటారు. ఇక లాస్ట్ లో రామ్ చరణ్ కాలు పోవడం రన్నింగ్ రేస్ లో విజయాన్ని సాధించడం అవన్నీ కూడా మాస్ ప్రేక్షకుడికి పెద్దగా నచ్చలేదు. ముందుగానే సినిమాను ఒక డిఫరెంట్ వే లో ప్రజెంట్ చేసి ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది.
అలా కాకుండా ఇప్పుడు సినిమాను తీసిన మాదిరిగానే వెళ్లాలంటే రామ్ చరణ్ కాకుండా అతని ప్లేస్ లో మరో హీరో ఉంటే ఆ కథ అందరికీ నచ్చేదని తను కొన్ని ఆసక్తికరమైన విషయాలైతే చెప్పాడు. మొత్తానికైతే బుచ్చిబాబు ఈ విషయాన్ని తెలుసుకొని నెక్స్ట్ తను చేయబోయే సినిమాల విషయంలో వీటిని రిపీట్ చేయకుండా ఉంటే మంచిదని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు…