Homeక్రీడలుPrasidh Krishna IPL 2026 : నాలుగు మ్యాచ్ ల్లో పది వికెట్లు.. ఇతడు ఇలానే...

Prasidh Krishna IPL 2026 : నాలుగు మ్యాచ్ ల్లో పది వికెట్లు.. ఇతడు ఇలానే బౌలింగ్ చేస్తే టీమిండియాలో రీఎంట్రి గ్యారెంటీ

Prasidh Krishna IPL 2026 : గొప్ప గొప్ప బౌలర్లు తేలిపోతున్నారు. పరుగులు ఇస్తూ చేతులెత్తేస్తున్నారు. ఇతడు మాత్రం బంతితో మ్యాజిక్ చేస్తున్నాడు. వికెట్లను పడగొడుతూ అదరగొడుతున్నాడు.. పిచ్ తో సంబంధం లేకుండా.. బ్యాటర్ ఎవరనేది పట్టించుకోకుండా దుమ్ము రేపుతున్నాడు.. మామూలుగా అయితే ఐపీఎల్ లో పరుగుల పేరడైజ్ కొనసాగుతూ ఉంటుంది. కానీ, ఇతడు వికెట్లను పడగొడుతూ సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో గుజరాత్ జట్టు తరఫున ఆడుతున్నాడు ప్రసిద్ కృష్ణ. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడాడు. ఇందులో 16 ఓవర్ల పాటు బౌలింగ్ వేశాడు. 152 పరుగులు ఇచ్చాడు. ఒకసారి నాలుగు వికెట్ల ఘనతను సాధించాడు. మొత్తంగా 10 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 15.20 యావరేజ్ తో కొనసాగుతున్నాడు.

ఆదివారం లక్నోతో జరిగిన మ్యాచ్లో.. ప్రసిద్ కృష్ణ దుమ్మురేపాడు. ప్రారంభం నుంచి కట్టుదిట్టంగా బౌలింగ్ వేశాడు. 4 ఓవర్ల పాటు బౌలింగ్ వేసిన ఇతడు కేవలం 28 పరుగులు ఇచ్చాడు. నాలుగు వికెట్లు పడగొట్టాడు.. ప్రమాదకరమైన మార్క్రం(30), ఆయుష్ బదోని (9), పూరన్(19), ముకుల్ చౌదరి(18) వికెట్లను పడగొట్టాడు.. ముఖ్యంగా సీమ్ ఆఫ్ డెలివరీలు వేసి సంచలనం సృష్టించాడు.. బంతితో పేస్ జనరేట్ చేసినప్పటికీ.. బ్యాటర్లు పరుగులు తీయకుండా జాగ్రత్త పడ్డాడు.

ప్రసిద్ కు తోడుగా మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ వేసాడు. ఇతర కూడా నాలుగు ఓవర్ల పాటు బౌలింగ్ వేసి.. కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఒక వికెట్ పడగొట్టాడు. దీంతో లక్నో జట్టు స్కోరు 20 ఓవర్లకు.. 8 వికెట్లు నష్టానికి 164 పరుగుల వద్ద ఆగిపోయింది.

లక్నో జట్టులో ఓపెనర్ మార్క్రం చేసిన 30 పరుగులే టాప్ స్కోర్ అంటే.. గుజరాత్ బౌలర్ల బౌలింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. లక్నో లో జరుగుతున్న ఈ మ్యాచ్లో ముందుగా.. పంత్ జట్టు బ్యాటింగ్ చేసింది. అయితే ప్రారంభం నుంచి గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేశారు. లక్నో బ్యాటర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. దీంతో ఒక దశలో లక్నో జట్టు కనీసం 150 పరుగులైనా చేయగలుగుతుందా అనే అనుమానం కలిగింది. ఆ తర్వాత లక్నో జట్టు బ్యాటర్లు చివర్లో పరుగులు తీయడంతో ఆ స్కోరు సాధ్యమైంది.

ప్రసిద్ అద్భుతంగా బౌలింగ్ వేస్తున్న నేపథ్యంలో.. టీమిండియాలో అతడికి మళ్ళీ చోటు లభించడం ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి. జూన్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగే టోర్నీలో అతడికి అవకాశం లభిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అదే గనుక జరిగితే.. తన పునరాగమనాన్ని ఘనంగా చాటితే ప్రసిద్ కు తిరుగుండదని అభిమానులు చెబుతున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular