Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సర్జరీ పై మెగా ఫ్యామిలీ మౌనం.. మండిపడుతున్న ఫ్యాన్స్..

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సర్జరీ పై మెగా ఫ్యామిలీ మౌనం.. మండిపడుతున్న ఫ్యాన్స్..

Pawan Kalyan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రీసెంట్ గానే ముంబై లో తన కుడి భుజానికి సర్జరీ చేయించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. పదేళ్ల క్రితం అభిమానుల అత్యుత్సాహం కారణంగా , జనాల్లోకి పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు , ఆయన చేతులు పట్టుకొని లాగడంతో , దెబ్బలు తగిలాయి. అప్పట్లో డాక్టర్లకు చూపించగా సర్జరీ అవసరమని సూచించారు. కానీ పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు , క్రమేణా రెండు భుజాలకు గాయం తీవ్ర రూపం […]

Pawan Kalyan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రీసెంట్ గానే ముంబై లో తన కుడి భుజానికి సర్జరీ చేయించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. పదేళ్ల క్రితం అభిమానుల అత్యుత్సాహం కారణంగా , జనాల్లోకి పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు , ఆయన చేతులు పట్టుకొని లాగడంతో , దెబ్బలు తగిలాయి. అప్పట్లో డాక్టర్లకు చూపించగా సర్జరీ అవసరమని సూచించారు. కానీ పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు , క్రమేణా రెండు భుజాలకు గాయం తీవ్ర రూపం దాల్చింది. రీసెంట్ గానే ముంబై కి వెళ్లి అంబానీ హాస్పిటల్ లో టెస్టులు చేయించుకోగా, తక్షణమే సర్జరీ అవసరమని డాక్టర్లు సూచించారు. షెడ్యూల్ చేసిన ప్రభుత్వ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న తర్వాత వచ్చి సర్జరీ చేయించుకుంటానని చెప్పిన పవన్ కళ్యాణ్ , చెప్పినట్టుగానే తన కుడి భుజానికి సర్జరీ చేయించుకున్నారు. నిన్ననే సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని కలిసి పరామర్శించిన సంగతి తెలిసిందే.

నేడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్ పవన్ కళ్యాణ్ ని కలిశారు. వీటికి సంబంధించిన ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అంతా బాగానే ఉంది కానీ , మెగా ఫ్యామిలీ నుండి మాత్రం ఇప్పటి వరకు ఒక్కరు కూడా ముంబై కి వెళ్లి పవన్ కళ్యాణ్ ని పరామర్శించలేదు. కనీసం సోషల్ మీడియా లో పోస్టులు కూడా పెట్టలేదు. చిరంజీవి ఇలాంటి సందర్భాల్లో ప్రస్తుత పరిస్థితి పై అప్డేట్స్ ఇస్తుంటారు. గతంలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు కూడా చిరంజీవి స్వయంగా అప్డేట్స్ ని అందించేవారు. కానీ పవన్ కళ్యాణ్ సర్జరీ గురించి ఒక్క పోస్ట్ కూడా ఆయన వెయ్యలేదు. హాసిపిటల్ నుండి ఆ విజువల్స్ ని చూస్తుంటే అభిమానులకే చాలా కష్టం గా ఉంది.

ఇక సొంత కుటుంబ సబ్యులకు ఎలా ఉండాలి?, ఎందుకని మెగా ఫ్యామిలీ ఇంతటి సైలెన్స్ మైంటైన్ చేస్తోంది, తోటి రాజకీయ నాయకులకు ఉన్న శ్రద్ద కూడా సొంత కుటుంబ సభ్యులకు లేదా?, ఇదెక్కడి న్యాయం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే చిరంజీవి ప్రస్తుతం షూటింగ్ లో బిజీ గా ఉన్నారని , షెడ్యూల్ పూర్తి అవ్వగానే ముంబై కి వెళ్లి పవన్ కళ్యాణ్ ని కలుస్తాడని సోషల్ మీడియాలో కొంతమంది సీనియర్ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ముంబై హాస్పిటల్ లో ఉన్న పవన్ కళ్యాణ్ , మరో మూడు రోజులు డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉండబోతున్నారు. ఆయనతో పాటు సతీమణి అన్నా లెజినోవా కూడా ఉంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper