Homeఎంటర్టైన్మెంట్Maa Inti Bangaram 15 Days Collections : 'మా ఇంటి బంగారం' 15 రోజుల...

Maa Inti Bangaram 15 Days Collections : ‘మా ఇంటి బంగారం’ 15 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా తగ్గని జోరు..

Maa Inti Bangaram 15 Days Collections : సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకొని , కేవలం రెండవ రోజే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ రన్ ఏ మాత్రం తగ్గలేదు. నిన్న కొత్తగా రెండు సినిమాలు వచ్చినప్పటికీ కూడా ఈ సినిమా […]

Maa Inti Bangaram 15 Days Collections : సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకొని , కేవలం రెండవ రోజే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ రన్ ఏ మాత్రం తగ్గలేదు. నిన్న కొత్తగా రెండు సినిమాలు వచ్చినప్పటికీ కూడా ఈ సినిమా జోరు తగ్గకపోవడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 15 వ రోజున 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు , ఈ సినిమా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది. ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి 15 రోజుల్లో ఎంత షేర్ వసూళ్లు వచ్చాయి , ఎంత లాభాలు వచ్చాయి , ఇంకా ఎంత లాభాలు రావొచ్చు అనేది ఒకసారి చూద్దాం.

ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి నైజాం ప్రాంతం నుండి ఈ చిత్రానికి దాదాపుగా 13 కోట్ల 87 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ + సీడెడ్ ప్రాంతాలకు కలిపి 10 కోట్ల 56 లక్షలు రాగా, ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి ఇప్పటి వరకు 24 కోట్ల 43 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. గ్రాస్ వసూళ్లు దాదాపుగా 47 కోట్ల 25 లక్షల వరకు వచ్చింది. అదే విధంగా తమిళనాడు నుండి 1 కోటి 86 లక్షలు రాగా , కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 5 కోట్లు , ఓవర్సీస్ నుండి 10 కోట్ల 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 41 కోట్ల 69 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 84 కోట్ల 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

లాభాలు దాదాపుగా 29 కోట్ల 69 లక్షల రూపాయిలు రాగా, మరో 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు అదనంగా లాంగ్ రన్ లో వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. థియేట్రికల్ రన్ ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించకపోవడం తో , ఈ సినిమా ఓటీటీ లో కూడా ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి థియేట్రికల్ రన్ ఇంకా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రతిష్టాత్మక వంద కోట్ల గ్రాస్ క్లబ్ లోకి ఈ చిత్రం చేరుతుందో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper