Homeఎంటర్టైన్మెంట్Maa Inti Bangaram Collections: స్టడీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న 'మా ఇంటి బంగారం'.. 12వ...

Maa Inti Bangaram Collections: స్టడీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ‘మా ఇంటి బంగారం’.. 12వ రోజున ఎంత గ్రాస్ వచ్చిందంటే..

Maa Inti Bangaram Collections: స్టార్ హీరోలకు కూడా సాధ్యం అవ్వనటువంటి అరుదైన రికార్డ్స్ ని సమంత ‘మా ఇంటి బంగారం’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద నెలకొల్పుతోంది. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాకు అయినా వర్కింగ్ డేస్ లో ఎంతో కొంత కలెక్షన్స్ డ్రాప్ అవ్వడం సహజం, అది పాజిటివ్ టాక్ వచ్చినా సరే. కానీ ముందు రోజు తో పోలిస్తే ఒక్క శాతం వసూళ్లు కూడా డ్రాప్ అవ్వకపోవడాన్ని ఎప్పుడైనా చూశామా?, కానీ […]

Maa Inti Bangaram Collections: స్టార్ హీరోలకు కూడా సాధ్యం అవ్వనటువంటి అరుదైన రికార్డ్స్ ని సమంత ‘మా ఇంటి బంగారం’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద నెలకొల్పుతోంది. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాకు అయినా వర్కింగ్ డేస్ లో ఎంతో కొంత కలెక్షన్స్ డ్రాప్ అవ్వడం సహజం, అది పాజిటివ్ టాక్ వచ్చినా సరే. కానీ ముందు రోజు తో పోలిస్తే ఒక్క శాతం వసూళ్లు కూడా డ్రాప్ అవ్వకపోవడాన్ని ఎప్పుడైనా చూశామా?, కానీ ‘మా ఇంటి బంగారం’ చిత్రం ఆ అరుదైన ఘనత ని సాధించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ చిత్రానికి 11 వ రోజున , అనగా సోమవారం రోజున తెలుగు రాష్ట్రాల నుండి 85 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా 12 వ రోజున కూడా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 85 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు ఎలాంటి హిస్టారికల్ బ్లాక్ బస్టర్ అనేది.

ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 11 వ రోజు కంటే 12 వ రోజునే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. 11 వ రోజున 2 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, 12 వ రోజున 2 కోట్ల 55 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మంగళవారం రోజున నేషనల్ మల్టీప్లెక్స్ థియేటర్స్ లో టిక్కెట్ రేట్స్ పై ఆఫర్లు ఉంటాయి. అందుకే ముందు రోజుతో పోలిస్తే ఆరోజున ఎక్కువ వసూళ్లు నమోదు అవుతుంటాయి. ఇక ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం నుండి 13 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, సీడెడ్ + ఆంధ్ర ప్రదేశ్ నుండి 9 కోట్ల 88 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 22 కోట్ల 86 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, 44 కోట్ల 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే తమిళనాడు నుండి 1 కోటి 82 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా 4 కోట్ల 85 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్ నుండి అయితే ఏకంగా 10 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తమగు 39 కోట్ల 58 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 80 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్ళు వచ్చాయి. లాభాల సంఖ్య 27 కోట్ల 58 లక్షలకు చేరింది. భవిష్యత్తులో ఈ లెక్క ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper