Homeఎంటర్టైన్మెంట్Maa Inti Bangaram: మూవీ లవర్స్ కి 'మా ఇంటి బంగారం' మేకర్స్ బంపర్ ఆఫర్.....

Maa Inti Bangaram: మూవీ లవర్స్ కి ‘మా ఇంటి బంగారం’ మేకర్స్ బంపర్ ఆఫర్.. టికెట్ రేట్స్ ఇంతకీ తగ్గించారో తెలుసా..

Maa Inti Bangaram: సమంత ప్రధాన పాత్ర పోషించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం విడుదలై రెండు వారాలు పూర్తి అయ్యింది. అయినప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన వసూళ్లు చాలా స్టడీ గా ఉన్నాయి. ఈ రేంజ్ లాంగ్ రన్ ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు మాత్రమే కాదు , మూవీ టీం కూడా ఊహించలేదు. వీకెండ్స్ లో మంచి వసూళ్లు నమోదు అవ్వడం సహజమే. కానీ ఈ చిత్రానికి వర్కింగ్ డేస్ లో కూడా చాలా డీసెంట్ […]

Maa Inti Bangaram: సమంత ప్రధాన పాత్ర పోషించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం విడుదలై రెండు వారాలు పూర్తి అయ్యింది. అయినప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన వసూళ్లు చాలా స్టడీ గా ఉన్నాయి. ఈ రేంజ్ లాంగ్ రన్ ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు మాత్రమే కాదు , మూవీ టీం కూడా ఊహించలేదు. వీకెండ్స్ లో మంచి వసూళ్లు నమోదు అవ్వడం సహజమే. కానీ ఈ చిత్రానికి వర్కింగ్ డేస్ లో కూడా చాలా డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి ఈ రేంజ్ లాంగ్ రన్ ని చూసి ఎన్నేళ్లు అయ్యిందో. 2 వారాల్లో 80 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం ఫుల్ రన్ లో కచ్చితంగా 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

ఈరోజు ఏకంగా 3 కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ఒకవేళ అవి క్లిక్ అయితే ‘మా ఇంటి బంగారం’ వసూళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందేమో అని ముందు జాగ్రత్తతో ఈ సినిమా టికెట్ రేట్స్ ని బాగా తగ్గించేశారు. సింగిల్ స్క్రీన్స్ లో కేవలం 100 రూపాయలకు ఈ చిత్రాన్ని చూడొచ్చు , అదే విధంగా మల్టీప్లెక్స్ థియేటర్స్ లో ఒక్కో టికెట్ ధర కేవలం 180 రూపాయిలు మాత్రమేనట. ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్న ఈ చిత్రానికి, వాళ్ళని మరింత ఆకర్షించేందుకు ఇలా టికెట్ రేట్స్ తగ్గించడం అనేది చాలా మంచి స్ట్రాటజీ. ఇక ఈరోజు విడుదలైన మూడు సినిమాలకు ఆడియన్స్ నుండి , క్రిటిక్స్ నుండి పాజిటివ్ టాక్ రాలేదు కాబట్టి, మూవీ లవర్స్ కి ఈ వారం కూడా ‘మా ఇంటి బంగారం’ చిత్రమే ఏకైక ఛాయస్. అందుకే ఈ చిత్రం కచ్చితంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరుతుందని అంటున్నారు విశ్లేషకులు.

మరోపక్క ఈ సినిమా కలెక్షన్స్ కి మరింత బూస్ట్ ఇచ్చేలా మూవీ టీం స్పెషల్ ప్రొమోషన్స్ లో పాల్గొంటూ ఫుల్ బిజీ గా ఉంటోంది. రీసెంట్ గా ఈ మూవీ టీం ఇచ్చినటువంటి సక్సెస్ మీట్ ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక ఓవర్సీస్ లో ఈ చిత్రం రెండు మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. జులై 10 న విడుదలయ్యే లెనిన్ వరకు ఎలాంటి చెప్పుకోదగ్గ సినిమాలు లేవు కాబట్టి , ‘మా ఇంటి బంగారం’ మూవీ లాంగ్ రన్ ఈ పది రోజులు చాలా గట్టిగ ఉంటుందని అంటున్నారు నెటిజెన్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper