Homeఎంటర్టైన్మెంట్Nagabandham Day 1 Collections : 'నాగబంధం' మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇది...

Nagabandham Day 1 Collections : ‘నాగబంధం’ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇది మామూలు షాక్ కాదు.. పాపం నిర్మాత..

Nagabandham Day 1 Collections : విడుదలకు ముందు ఈ మధ్యకాలం లో ప్రేక్షకుల్లో మంచి అంచనాలను రేకెత్తించిన చిత్రాల్లో ఒకటి ‘నాగబంధం’. కొత్త హీరో పై వంద కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేయడం తో , కచ్చితంగా ఈ సినిమాలో ఎదో విషయం ఉండే ఉంటుందని ఆశించారు జనాలు. పైగా అనంత పద్మనాభ స్వామి గుడిపై తీస్తున్న సినిమా కావడంతో , ఫాంటసీ చిత్రాలను ఇష్టపడే ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం […]

Nagabandham Day 1 Collections : విడుదలకు ముందు ఈ మధ్యకాలం లో ప్రేక్షకుల్లో మంచి అంచనాలను రేకెత్తించిన చిత్రాల్లో ఒకటి ‘నాగబంధం’. కొత్త హీరో పై వంద కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేయడం తో , కచ్చితంగా ఈ సినిమాలో ఎదో విషయం ఉండే ఉంటుందని ఆశించారు జనాలు. పైగా అనంత పద్మనాభ స్వామి గుడిపై తీస్తున్న సినిమా కావడంతో , ఫాంటసీ చిత్రాలను ఇష్టపడే ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూసారు. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే ఆడియన్స్ నుండి ఘోరమైన నెగెటివ్ టాక్ వచ్చింది. అనేక మంది ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్లి నిద్రపోయాము అంటూ సోషల్ మీడియా లో వీడియోలు సైతం అప్లోడ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అయినప్పటికీ కూడా అంచనాలు భారీ రేంజ్ లో ఉండడం వల్ల, ఈ చిత్రానికి డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి.

కానీ ఈ ఓపెనింగ్స్ నిర్మాతకు బడ్జెట్ రీకవరీ కి ఏ మాత్రం సరిపోవు అనేది వాస్తవం. ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి ఎంత వసూళ్లు వచ్చాయో , బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి ఇంకా ఎంత వసూళ్లు రావాలి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే ఈ చిత్రానికి మొదటి రోజు నైజాం ప్రాంతం నుండి 1 కోటి 73 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు , ఆంధ్ర ప్రదేశ్ + సీడెడ్ నుండి 1 కోటి 32 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి 3 కోట్ల 5 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 1 కోటి 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే కర్ణాటక నుండి 40 లక్షలు , హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 55 లక్షలు, ఓవర్సీస్ నుండి 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 4 కోట్ల 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 2 కోట్ల 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అయితే ఈ సినిమా మినిమం రేంజ్ లో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 28 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. అది దాదాపుగా అసాధ్యమే కాబట్టి , ఈ చిత్రాన్ని ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఒకటిగా చూడొచ్చు. ఈ చిత్రానికి అడ్వాన్స్ కట్టిన బయ్యర్స్ కి ఒక్క పైసా కూడా మిగిలే పరిస్థితి లేదు , ఇక నిర్మాత పరిస్థితి ఊహిస్తేనే ఏడుపొస్తోంది అంటూ నెటిజెన్స్ బాధపడుతున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper