Homeఎంటర్టైన్మెంట్Maa Inti Bangaram 13 Days Collections: 'మా ఇంటి బంగారం' 13 రోజుల వరల్డ్...

Maa Inti Bangaram 13 Days Collections: ‘మా ఇంటి బంగారం’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇదేమి బ్యాటింగ్ బాబోయ్..ఇప్పట్లో ఆగేలా లేదు..

Maa Inti Bangaram 13 Days Collections: సమంత ‘మా ఇంటి బంగారం’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటికీ స్టడీ కలెక్షన్స్ ని రాబడుతూ , చాలా సాలిడ్ మూడవ వీకెండ్ ని సూచిస్తూ ముందుకు దూసుకెళ్తోంది. ఈ రేంజ్ స్టడీ రన్ ఈమధ్య కాలం లో స్టార్ హీరోలకు కూడా రాలేదు అనడం లో అతిశయోక్తి లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ బలం వల్లే , ఈ చిత్రం ఈ రేంజ్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు […]

Maa Inti Bangaram 13 Days Collections: సమంత ‘మా ఇంటి బంగారం’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటికీ స్టడీ కలెక్షన్స్ ని రాబడుతూ , చాలా సాలిడ్ మూడవ వీకెండ్ ని సూచిస్తూ ముందుకు దూసుకెళ్తోంది. ఈ రేంజ్ స్టడీ రన్ ఈమధ్య కాలం లో స్టార్ హీరోలకు కూడా రాలేదు అనడం లో అతిశయోక్తి లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ బలం వల్లే , ఈ చిత్రం ఈ రేంజ్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. రేపు విడుదలయ్యే కొత్త సినిమాల్లో ఒక్క దానికి సూపర్ హిట్ టాక్ వచ్చినా , ‘మా ఇంటి బంగారం’ వసూళ్లపై కాస్త ప్రభావం పడొచ్చు. అలా కాకుండా , ఫ్లాప్ టాక్ , లేదా డివైడ్ టాక్ వంటివి వస్తే మాత్రం ఈ వీకెండ్ ని కూడా ‘మా ఇంటి బంగారం’ దంచి కొట్టేస్తుంది , అందులో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

వాళ్ళు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి 11 వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి 85 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా , 12 వ రోజున కూడా 85 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి స్ట్రాంగ్ హోల్డ్ ని కనబర్చుకుంది. ఇక 13 వ రోజున అయితే కేవలం 10 లక్షల రూపాయిల డ్రాప్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇంతటి స్టడీ రన్ స్టార్ హీరోలకు కూడా దక్కలేదు , అందుకు రీసెంట్ ఉదాహరణ పెద్ది. ఇక ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం నుండి 13 కోట్ల 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, సీడెడ్ + ఆంధ్ర ప్రాంతం నుండి 10 కోట్ల 21 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 23 కోట్ల 61 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 45 కోట్ల 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా తమిళనాడు నుండి 1 కోటి 84 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా , కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 4 కోట్ల 90 లక్షలు , ఓవర్సీస్ నుండి 10 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 40 కోట్ల 55 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 82 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. లాభాలు 28 కోట్ల 55 లక్షల వరకు వచ్చాయి, పరిస్థితి చూస్తుంటే కచ్చితంగా ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ ని రాబట్టడం పెద్ద కష్టమేమి కాదని అనిపిస్తోంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper