Homeఎంటర్టైన్మెంట్Akhil Akkineni: 'మా ఇంటి బంగారం' పై ప్రశంసల వర్షం కురిపించిన అక్కినేని అఖిల్..వీడియో వైరల్..

Akhil Akkineni: ‘మా ఇంటి బంగారం’ పై ప్రశంసల వర్షం కురిపించిన అక్కినేని అఖిల్..వీడియో వైరల్..

Akhil Akkineni: నాగ చైతన్య తో విడాకులు తీసుకున్నప్పటికీ కూడా సమంత అతని తమ్ముడు అక్కినేని అఖిల్ తో ఇప్పటికీ మంచి రిలేషన్ ని మైంటైన్ చేస్తూ వస్తోంది. రెండేళ్ల క్రితం వరకు ఆమె అఖిల్ ప్రతీ పుట్టినరోజు కి శుభాకాంక్షలు చెప్తూ వచ్చేది. అంతే కాకుండా సమంత కి మయోసిటిస్ వ్యాధి సోకిన కొత్తల్లో , ఆమె త్వరగా ఆ వ్యాధి నుండి కోలుకోవాలని ఆమె పోస్టుల క్రింద కామెంట్స్ అఖిల్ కామెంట్స్ పెట్టిన సందర్భాలు […]

Akhil Akkineni: నాగ చైతన్య తో విడాకులు తీసుకున్నప్పటికీ కూడా సమంత అతని తమ్ముడు అక్కినేని అఖిల్ తో ఇప్పటికీ మంచి రిలేషన్ ని మైంటైన్ చేస్తూ వస్తోంది. రెండేళ్ల క్రితం వరకు ఆమె అఖిల్ ప్రతీ పుట్టినరోజు కి శుభాకాంక్షలు చెప్తూ వచ్చేది. అంతే కాకుండా సమంత కి మయోసిటిస్ వ్యాధి సోకిన కొత్తల్లో , ఆమె త్వరగా ఆ వ్యాధి నుండి కోలుకోవాలని ఆమె పోస్టుల క్రింద కామెంట్స్ అఖిల్ కామెంట్స్ పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే రీసెంట్ గానే సమంత ప్రధాన పాత్ర పోషించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై సూపర్ హిట్ గా నిల్చింది. ఈ వీకెండ్ తో ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి కూడా చేరబోతోంది. దాంతో సౌత్ లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం గా ‘మా ఇంటి బంగారం’ సరికొత్త రికార్డు ని నెలకొల్పింది.

ఈ సినిమా విజయం పట్ల సమంత అభిమానులు ఎంత ఆనందంగా ఉన్నారో , మరో పక్క ఆమెతో స్నేహం చేసే సినీ సెలబ్రిటీలు కూడా అంతే ఆనందంగా ఉన్నారు. సోషల్ మీడియా సాక్షిగా వీళ్లంతా శుభాకాంక్షలు కూడా తెలిపారు. వారిలో ఇప్పుడు అక్కినేని అఖిల్ కూడా చేరిపోయారు. ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ ఈ నెల 10 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అఖిల్ నాన్ స్టాప్ గా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. ఒక ఇంటర్వ్యూ లో రిపోర్టర్ ‘మా ఇంటి బంగారం’ మూవీ ప్రస్తావన తీసుకొని రాగా అఖిల్ చాలా కూల్ గా సమాధానం ఇచ్చారు.

ఆయన మాట్లాడుతూ ‘లెనిన్ మూవీ విడుదల హడావిడి లో ఉండడం వల్ల ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని చూడలేకపోయాను. కానీ నేను ట్రైలర్ చూసాను , చాలా నచ్చింది. ముఖ్యంగా ఆ చిత్రం లోని వైబ్ కి నీకు ప్రత్యేకంగా ఆకర్షితుడిని అయ్యాను. ఆ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని నేను ముందే ఊహించాను. ఈ సందర్భంగా మూవీ టీం మొత్తానికి నా శుభాకాంక్షలు. ప్రత్యేకంగా ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ చేస్తూ సమంత ఆ రేంజ్ యాక్షన్ సన్నివేశాల్లో నటించడం చాలా గొప్పగా నచ్చింది’ అంటూ చెప్పుకొచ్చారు అఖిల్. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అఖిల్ ‘మా ఇంటి బంగారం’ పై ఇంత పాజిటివ్ గా స్పందించారు కాబట్టి , సమంత కూడా ‘లెనిన్’ టీం కి శుభాకాంక్షలు చెప్తూ పోస్టు వేస్తుందా లేదా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ చర్చించుకుంటున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper