Homeక్రీడలుGautam Gambhir : ఇన్ని ఓటములు.. టీమిండియా కు గౌతమ్ గంభీర్ అవసరమా..

Gautam Gambhir : ఇన్ని ఓటములు.. టీమిండియా కు గౌతమ్ గంభీర్ అవసరమా..

Gautam Gambhir : ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు సంధానకర్తగా వ్యవహరించాడని.. 2024 లో ఐపీఎల్ సాధించడంలో కొంతమేర పాత్ర పోషించాడని నమ్ముతూ గౌతమ్ గంభీర్ కు టీమిండియా మేనేజ్మెంట్ కోచ్ పోస్ట్ ఆఫర్ చేసింది. అతడి కోసం అనేక రకాల నిబంధనలు మొత్తం సడలించింది. అతని కోరినట్టుగా జీతభత్యాలు ఇస్తోంది. సౌకర్యాలు కల్పిస్తోంది. నచ్చిన స్టాఫ్ ను సమకూర్చింది. ఇన్ని చేసినప్పటికీ.. కోట్ల డబ్బు కుమ్మరించినప్పటికీ ఉపయోగం లేదు. వైట్ బాల్ […]

Gautam Gambhir : ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు సంధానకర్తగా వ్యవహరించాడని.. 2024 లో ఐపీఎల్ సాధించడంలో కొంతమేర పాత్ర పోషించాడని నమ్ముతూ గౌతమ్ గంభీర్ కు టీమిండియా మేనేజ్మెంట్ కోచ్ పోస్ట్ ఆఫర్ చేసింది. అతడి కోసం అనేక రకాల నిబంధనలు మొత్తం సడలించింది. అతని కోరినట్టుగా జీతభత్యాలు ఇస్తోంది. సౌకర్యాలు కల్పిస్తోంది. నచ్చిన స్టాఫ్ ను సమకూర్చింది. ఇన్ని చేసినప్పటికీ.. కోట్ల డబ్బు కుమ్మరించినప్పటికీ ఉపయోగం లేదు.

వైట్ బాల్ ఫార్మాట్ లో స్థాయి పోయింది. రెడ్ బాల్ ఫార్మాట్ లో ఏకంగా పునాదులే కదిలిపోయాయి. చరిత్రలో ఎన్నడు లేని ఓటమిలో నమోదయ్యాయి. ఇటువంటి స్థితిలో గౌతమ్ గంభీర్ టీమిండియా కు కోచ్ గా అవసరమా అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి గౌతమ్ గంభీర్ కోచ్ గా వచ్చిన నాటికంటే.. రాకముందే టీమ్ ఇండియా పరిస్థితి గొప్పగా ఉన్నది. గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ఊహించని ఓటములు ఎదురవుతున్నాయి.

గౌతమ్ గంభీర్ శిక్షకుడిగా వచ్చిన తర్వాత స్వదేశంలో ఫస్ట్ టైం న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు వైట్ వాష్ కు గురైంది. వరుసగా మూడు టెస్టులు ఓడిపోయింది.

దాదాపు దశాబ్దం తర్వాత తొలిసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ని టీమిండియా కోల్పోయింది. ఆస్ట్రేలియా చేతిలో దారుణమైన ఓటములను ఎదుర్కొంది.

25 సంవత్సరాల తర్వాత సొంత గడ్డపై సౌతాఫ్రికా తో టెస్ట్ సిరీస్ ను టీమిండియా కోల్పోయింది. ఏకంగా రెండు టెస్టులలో ఓటమిపాలైంది. పరుగు మొత్తం పోగొట్టుకుంది.

డబ్ల్యూటీసీ ని ప్రవేశపెట్టిన తర్వాత వరుసగా రెండుసార్లు టీమిండియా ఫైనల్ వెళ్ళింది. కానీ గౌతమ్ గంభీర్ శిక్షకుడిగా వచ్చిన తర్వాత.. టీ మీడియా మూడోసారి ఫైనల్ వెళ్లలేకపోయింది.

సంత గడ్డమీద న్యూజిలాండ్ చేతిలో తొలిసారి టీమిండియా వన్డే సిరీస్ కోల్పోయింది.

టీమిండియా చరిత్రలో ఎన్నడు లేని విధంగా ఐరిష్ జట్టు చేతిలో వైట్ వాష్ కు గురైంది. టి20 సిరీస్ కోల్పోయింది.

ఇంగ్లాండ్ గడ్డమీద తొలిసారి టీమిండియా టి20 సిరీస్ కోల్పోయింది. ఏకంగా వరుసగా మూడు టి20 మ్యాచ్ లు ఓడిపోయింది. అంతర్జాతీయంగా టి20 చరిత్రలో టీమిండియా అత్యంత దారుణమైన ఓటమిని ఇంగ్లాండ్ చేతిలో మూటగట్టుకుంది. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన రెండవ టి20 మ్యాచ్లో ఏకంగా 125 పరుగుల తేడాతో టీమిండియా దారుణమైన ఓటమిని మూట కట్టుకుంది.

అటు వైట్ బాల్.. ఇటు రెడ్ బాల్.. ఏ ఫార్మాట్ చూసుకున్నా సరే టీమిండియాకు గౌతమ్ గంభీర్ గొప్పగా చెప్పుకునే విజయాలు అందించలేకపోయాడు. అసలు అతని మూర్ఖత్వం వల్ల టీమిండియా లో క్రీడా స్ఫూర్తి అంటూ లేకుండా పోయింది. రోహిత్ శర్మకు పొమ్మను లేక పొగ పెట్టాడు. విరాట్ కోహ్లీ వెళ్ళిపోయాడు. రవిచంద్రన్ అశ్విన్ వెళ్లిపోయాడు. సూర్య కుమార్ యాదవ్ వైట్ బాల్ ఫార్మాట్ నుంచి తిరస్కరణకు గురయ్యాడు. ఇలా చెప్పుకుంటూ పోతే గౌతమ్ శిక్షణలో టీమ్ ఇండియాకు ఎదురైన పరాభవాల మీద ఏకంగా ఒక పుస్తకమే రాయవచ్చు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper