Homeఆంధ్రప్రదేశ్‌Anna Battuni Sivakumar: లేని కంపెనీ ఉన్నట్టుగా.. కోట్లు కొట్టేశారు.. ఆ వైసిపి మాజీ ఎమ్మెల్యే...

Anna Battuni Sivakumar: లేని కంపెనీ ఉన్నట్టుగా.. కోట్లు కొట్టేశారు.. ఆ వైసిపి మాజీ ఎమ్మెల్యే చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..

Anna Battuni Sivakumar:మాయ.. మంత్రం.. తంత్రం.. ఈ మూడు పదాలను ఆయన పాటించారు. బ్రహ్మాండంగా కోట్లు కొట్టేశారు. లేనిది ఉన్నట్టుగా భ్రమ కల్పించారు. మొత్తానికి మాయ చేసారు. కాకపోతే రోజులన్నీ ఒకే విధంగా ఉండవు కదా. అధికారంలో ఉన్నారు కాబట్టి అప్పట్లో ఎలా చేసినా చెల్లుబాటయింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అలాంటి అవకాశం కూడా లేదు. మొత్తంగా చూస్తే చేసిన మోసం.. సాగించిన వ్యవహారం అన్ని కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్నా […]

Anna Battuni Sivakumar:మాయ.. మంత్రం.. తంత్రం.. ఈ మూడు పదాలను ఆయన పాటించారు. బ్రహ్మాండంగా కోట్లు కొట్టేశారు. లేనిది ఉన్నట్టుగా భ్రమ కల్పించారు. మొత్తానికి మాయ చేసారు. కాకపోతే రోజులన్నీ ఒకే విధంగా ఉండవు కదా. అధికారంలో ఉన్నారు కాబట్టి అప్పట్లో ఎలా చేసినా చెల్లుబాటయింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అలాంటి అవకాశం కూడా లేదు. మొత్తంగా చూస్తే చేసిన మోసం.. సాగించిన వ్యవహారం అన్ని కళ్ళ ముందు కనిపిస్తున్నాయి.

వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్ కు సంబంధించిన వ్యవహారంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆయన మెడకు ఉచ్చు గట్టిగానే బిగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే భూమికి సంబంధించిన వ్యవహారంలో పత్రాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఆయన రుణం తీసుకున్నట్టుగా చెబుతున్న ఏపీజే ఇంపెక్స్ అనే కంపెనీకి సంబంధించిన వ్యవహారాల విషయంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నట్టు సమాచారం.

విజయవాడ నగరంలో ఐకెఎఫ్ అనే ఫైనాన్స్ సంస్థ ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో తెనాలి ఒకటో పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో కంపెనీకి సంబంధించిన చిరునామాలను పరిశీలించగా అక్కడ కంపెనీ కార్యాలయం బోర్డు.. ఇతర కార్యకలాపాలకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించలేదని విషయాన్ని పోలీసులు గుర్తించిన సమాచారం. పోలీసుల దర్యాప్తులో భాగంగా ఏపీజే ఇంపెక్స్ పేరుతో సుమారు మూడు కోట్ల రుణాన్ని శివకుమార్ 2019లో తీసుకున్నారు. రుణం పొందిన తర్వాత బ్యాంకు ఖాతాలలో జరిగిన లావాదేవీలు.. ఇతర అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. లోన్ తీసుకున్న తర్వాత కంపెనీ పేరుతో శివకుమార్ వ్యాపార కార్యకలాపాలు సాగించలేదా.. కేవలం డబ్బు పొందడానికి మాత్రమే కంపెనీ పేరును ఉపయోగించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.. అయితే ఈ అంశాలకు సంబంధించి తృది నిర్ధారణ ఇంకా రావాల్సి ఉంది. అయితే ఈ కంపెనీ ద్వారా ఎటువంటి కార్యకలాపాలు సాగించారు.. రుణం ఎలా తీసుకున్నారు.. దానికి ఎటువంటి పత్రాలు సమర్పించారు.. అనే విషయాలు దర్యాప్తు పూర్తయిన తర్వాత వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది

ఈ కేసులో కంపెనీ నిర్వహణ.. లోన్ తీసుకోవడానికి సమర్పించిన పత్రాల వంటి వాటి మీద పోలీసులు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. గతంలో భూమికి సంబంధించిన సర్వే వివరాలు.. ఎన్ కంబరెన్స్ సర్టిఫికెట్లు.. వంటి పత్రాల మీద అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే వాటిని ఎవరు జారీ చేశారు.. ఎటువంటి ఆధారాలతో వాటిని ధ్రువీకరించారు.. సంబంధిత అధికారులు వాటి మీద సంతకాలు ఎలా పెట్టారు.. వంటి అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా తెనాలి పురపాలకం.. కొత్తపేట సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో అధికారులు రికార్డులు పరిశీలిస్తున్నారు.

ప్రధానంగా ఏపీజే ఇంపెక్స్ కంపెనీ మీదనే ఇక్కడ ప్రశ్నలు వినిపిస్తున్నా. రిజిస్ట్రేషన్ చేసిన సమయంలో పేర్కొన్న కంపెనీ చిరునామా.. కార్యాలయం చేస్తున్న కార్యకాలపాలు.. బ్యాంకు ద్వారా సాగించిన లావాదేవీలు.. ఆడిట్ వ్యవహారాలు.. లోన్ తీసుకున్నప్పుడు సమర్పించిన ఆస్తి పత్రాలు.. ఇలా అన్ని అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.. ఒకవేళ పత్రాలలో పొందుపరచిన చిరునామాలలో కంపెనీ గనుక కార్యకలాపాలు సాగించలేదని తీరితే ఈ అంశం అత్యంత కీలకంగా మారుతుంది.

కంపెనీ.. రుణం మంజూరు వంటి వాటికి పత్రాలు జారీ చేసిన నేపథ్యంలో వాటికి ప్రభుత్వ ధృవీకరణలు ఉన్నాయా.. ఎటువంటి వాటిని అమలు చేశారు.. వాటి వెనుక ఉన్న రికార్డులు ఏమిటి.. అనే అంశాల మీద పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.. ఒకవేళ ఆ పత్రాలు నకిలీవి అయితే.. అప్పుడు ఏం చర్యలు తీసుకోవాలో కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper