Flipkart big billion days: ఆన్లైన్లో షాపింగ్ చేసే వారికి మరోసారి Flipkart బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది. బిగ్ బిలియన్ డేస్ ద్వారా సూపర్ న్యూస్ తీసుకొచ్చింది. బిగ్ బిలియన్ డేస్ ద్వారా స్మార్ట్ ఫోన్ లను.. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను మాత్రమే కాకుండా.. అనేక రకాల వస్తువుల మీద డిస్కౌంట్ ప్రకటించింది. ఇక్కడితోనే Flipkart ఆగిపోవడం లేదు.. డిజిటల్ సుబ్స్క్రిప్షన్లకు సంబంధించిన ప్రత్యేక ఆఫర్లను కూడా తీసుకొచ్చింది. ముఖ్యంగా యూట్యూబ్ ప్రీమియం ఉచితంగా పొందే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
YouTube premium అంటే ఏమిటి?
YouTube premium తీసుకుంటే.. ఎటువంటి ప్రకటనలు లేకుండా యూట్యూబ్ లో వీడియోలు చూడవచ్చు. స్క్రీన్ ఆఫ్ చేసిన సరే వీడియో లేదా మ్యూజిక్ వినొచ్చు. యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం అంటే ప్రయోజనాలు కూడా లభిస్తుంటాయి. వాస్తవానికి ఇటువంటి ప్రయోజనాలు పొందాలంటే కచ్చితంగా నెలవారి లేదా వార్షిక సుబ్స్క్రిప్షన్ అనేది అవసరం. Flipkart big billion days సందర్భంగా కొంతమంది కస్టమర్లకు యూట్యూబ్ ప్రీమియం ట్రయల్ లేదా ప్రమోషనల్ ఆఫర్ అందుబాటులో ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది ఎవరికి వర్తిస్తుంది.. ఎతకాల వరకు ఇది ఉచితంగా లభిస్తుంది.. అనే విషయాలు Flipkart అందించే ఆఫర్ మీద ఆధారపడి ఉంటాయి.
ఈ ఆఫర్ ఎలా చెక్ చేయాలి
YouTube premium free అనే పేరుతో కనిపించే ప్రతి లింకును నమ్మకూడదు. అధికారిక యాప్ లేదా వెబ్సైట్లో కనిపించే ఆఫర్ మాత్రమే పరిశీలించాలి. తెలియని వెబ్సైట్ లలోకి వెళ్లి వివరాలు సమర్పించి.. ఓటిపి ఎంటర్ చేస్తే మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఉచితం అని చెప్పినప్పటికీ ట్రయల్ వ్యవధి ముగిసిన తర్వాత ఆటోమేటిక్ గా చార్జీలు పడే అవకాశం ఉందా లేదా కూడా నిబంధనలలో పరిశీలించాలి.
అనేక ప్రయోజనాలు
బిగ్ బిలియన్ డేస్ ద్వారా సాధారణంగా స్మార్ట్ ఫోన్లు.. లాప్టాప్ లు.. టీవీలు.. గృహ వినియోగానికి సంబంధించి వస్తువులు.. ఫ్యాషన్.. యాక్ససరీస్ వంటి విభాగాలలో డిస్కౌంట్ లో అందుబాటులో ఉంటాయి. బ్యాంకు కార్డులు.. ఈఎంఐలు.. ఎక్స్చేంజ్ ఆఫర్లు.. సూపర్ కాయిన్స్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా బిగ్ బిలియన్ డేస్ లో లభించే అవకాశం.
అన్నింటినీ పరిశీలించాలి
అందువల్లే యూట్యూబ్ ప్రీమియం ఆఫర్ కోసం మాత్రమే కాకుండా.. మీరు ఎటువంటి వస్తువులు కొనుగోలు చేయాలి అనుకున్నారో వాటిపై అందించే డిస్కౌంట్.. బ్యాంక్ ఆఫర్.. క్యాష్ బ్యాక్.. ఎక్స్చేంజి బెనిఫిట్ వంటి వాటిని పరిశీలించాలి.ఫ్లిప్కార్ట్ అందించే బిగ్ బిలియన్ డేస్ లో యూట్యూబ్ ప్రీమియానికి సంబంధించి ఉచ్చుతా లేదా ట్రయల్ ఆఫర్ కనిపిస్తే దాని అర్హత.. చెల్లుబాటు వ్యవధి.. ఆటో రెన్యువల్ నిబంధనలు చూసిన తర్వాత మాత్రమే ఆక్టివేట్ చేసుకోవాలి. ఒకవేళ ఆ ఆఫర్ నిజంగా మీ అకౌంట్ కు అందుబాటులో ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఈ విషయాలను ఫ్లిప్కార్ట్ అధికారిక యాప్ లేదా వెబ్సైట్లో మాత్రమే పరిశీలించాలి.