Homeక్రీడలుక్రికెట్‌Hardik Pandya viral video : అది క్రికెట్ గ్రౌండ్ హార్దిక్ భయ్యా.. కొంచెం నీ...

Hardik Pandya viral video : అది క్రికెట్ గ్రౌండ్ హార్దిక్ భయ్యా.. కొంచెం నీ కామాన్ని కంట్రోల్ చేసుకో!

Hardik Pandya viral video : నాలుగు దిక్కుల మధ్య చేసే పనులు వేరే ఉంటాయి. నాలుగు గోడల మధ్య చేసే పనులు ఇంకో విధంగా ఉంటాయి. నాలుగు దిక్కుల మధ్య చేసేది నాలుగు గోడల మధ్య చేస్తే వేరే విధంగా ఉంటుంది. నాలుగు గోడల మధ్య చేసేది నాలుగు దిక్కుల మధ్య చేస్తే ఇంకో విధంగా ఉంటుంది. ఎటోచ్చి మనకంటూ ఒక వివేచన ఉండాలి. విచక్షణ కూడా ఉండాలి. అలాంటప్పుడే చూసేవాళ్ళకి ఇబ్బంది ఉండదు.. చేసే […]

Hardik Pandya viral video : నాలుగు దిక్కుల మధ్య చేసే పనులు వేరే ఉంటాయి. నాలుగు గోడల మధ్య చేసే పనులు ఇంకో విధంగా ఉంటాయి. నాలుగు దిక్కుల మధ్య చేసేది నాలుగు గోడల మధ్య చేస్తే వేరే విధంగా ఉంటుంది. నాలుగు గోడల మధ్య చేసేది నాలుగు దిక్కుల మధ్య చేస్తే ఇంకో విధంగా ఉంటుంది. ఎటోచ్చి మనకంటూ ఒక వివేచన ఉండాలి. విచక్షణ కూడా ఉండాలి. అలాంటప్పుడే చూసేవాళ్ళకి ఇబ్బంది ఉండదు.. చేసే వాళ్లకు తలనొప్పి ఉండదు.

కానీ మన దేశంలో ఉన్న సెలబ్రిటీలు ఇలాంటివి పట్టించుకోరు. నాలుగు దిక్కులు.. నాలుగు గోడలు అనేది వారికి సంబంధం ఉండదు. పని జరిగిపోవాల్సింది అంతే. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే.. టీమిండియాలో హార్దిక్ పాండ్యా అనే ఆటగాడు. రా అండ్ రస్టిక్ ఆట తీరును కొనసాగిస్తుంటాడు. నెవెర్ సీన్ షాట్ లు ఆడటంలో ఇక్కడికి ఇతడే సాటి. ఫార్మాట్ తో సంబంధం లేకుండా పరుగులు తీస్తూ ఉంటాడు. బౌలింగ్లో అదరగొడతాడు. బ్యాటింగ్లో దుమ్మురేపుతాడు. ఫీల్డింగ్ లో అయితే చెప్పాల్సిన పనిలేదు.

హార్దిక్ పాండ్యా ఆటగాడిగా ఎంతైతే పేరు సంపాదించాడో.. నటాషాతో విడాకులతో కూడా అంతే పాపులర్ అయ్యాడు. నటాషాతో విడాకులు తీసుకున్న తర్వాత మహిక మోడల్ తో మనవాడు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నాడు. ఖాళీ సమయం దొరికితే చాలు ఆమెతో గడుపుతున్నాడు. మహిక కూడా హార్దిక్ మొదటి భార్య కుమారుడితో ఇటీవల మాట్లాడింది. దానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో కనిపించాయి.

ఇప్పుడు ఇక హార్దిక్ పాండ్యా మరోసారి మీడియాలో.. సోషల్ మీడియాలో ప్రముఖంగా కనిపించాడు. టీమ్ ఇండియా టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అహ్మదాబాద్ మైదానంలో అతడు స్టెప్పులు వేశాడు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ తన ప్రేయసి మహికతో అహ్మదాబాద్ మైదానంలో స్వేచ్ఛగా విహరించాడు. ఆమెకు ముద్దు పెట్టాడు. గాఢంగా ఆ లింగనం చేసుకున్నాడు. చుట్టుపక్కల జనం ఉన్నారని మర్చిపోయి.. ఆమెతో అత్యంత చనువుగా ఉన్నాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పుడు సంచలనం కలిగిస్తున్నాయి. “హార్దిక్ భయ్యా 4 గోడల మధ్య చేసే పని నాలుగు దిక్కులలో చేస్తున్నావ్. నీ కామాన్ని కొంచెం కంట్రోల్ చేసుకో” అంటూ సోషల్ మీడియాలో అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper