Homeటాప్ స్టోరీస్function hall food issue : ఇలా బోర్డు పెట్టడంలో అర్థం ఉంది.. ఎందుకంటే ఊరూ...

function hall food issue : ఇలా బోర్డు పెట్టడంలో అర్థం ఉంది.. ఎందుకంటే ఊరూ పేరూ లేనివారు తినడం పెరిగిపోయింది!

function hall food issue : ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అని పెద్దలు అన్నారు. ఎందుకంటే ఆ రెండిట్లో ఖర్చు అధికంగా ఉంటుంది. ఇటీవల కాలంలో ఇంటి నిర్మాణం విషయంలోనూ.. పెళ్లి చేసే తీరులోనూ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఆడంబరాలకు పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో చాలామంది స్థాయికి మించి ఖర్చు పెడుతున్నారు. దుస్తులు.. బంగారం.. ఆహారం.. ఇలా ఎందులోనూ కూడా తగ్గడం లేదు. పైగా ఒకరిని చూసి ఒకరు భారీగా ఖర్చు పెడుతున్నారు. […]

function hall food issue : ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అని పెద్దలు అన్నారు. ఎందుకంటే ఆ రెండిట్లో ఖర్చు అధికంగా ఉంటుంది. ఇటీవల కాలంలో ఇంటి నిర్మాణం విషయంలోనూ.. పెళ్లి చేసే తీరులోనూ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఆడంబరాలకు పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో చాలామంది స్థాయికి మించి ఖర్చు పెడుతున్నారు. దుస్తులు.. బంగారం.. ఆహారం.. ఇలా ఎందులోనూ కూడా తగ్గడం లేదు. పైగా ఒకరిని చూసి ఒకరు భారీగా ఖర్చు పెడుతున్నారు. ఇలా ఖర్చు చేసేవారు పెరిగిపోవడంతో ఈవెంట్ సంస్థలు కూడా ఎక్కువ అవుతున్నాయి.

సాధారణంగా ఏదైనా మనం వేడుక చేసేటప్పుడు ఒక అంచనాతో వంటలు వండుతాం. వచ్చిన వారికి మనదైన శైలిలో వంటలు వడ్డిస్తాం. కొంతకాలంగా ప్రతి వేడుక కూడా ఫంక్షన్ హాల్లో చేసుకోవడం పరిపాటిగా మారిపోయింది. నగరం నుంచి మొదలు పెడితే మారుమూల మండలం వరకు అంతటా ఇదే పరిస్థితి. అందువల్లే క్యాటరింగ్ సంస్థలు పెరిగిపోయాయి. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఫంక్షన్ హాల్స్ లో ఊరు పేరు లేనివారు రావడం పెరిగిపోయింది. ఫలితంగా వండిన వంటలు నిండుకొని.. వేడుకలు జరిపే వారి పరిస్థితి దారుణంగా మారిపోతుంది. ఈ సంఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోయిన రోజుల్లో.. ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్ నగరంలోని ఓ ఫంక్షన్ హాల్ నిర్వాహకులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.

మహబూబాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్ నిర్వాహకులు ఏర్పాటుచేసిన బోర్డు సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తోంది. ఆ బోర్డు లో ఉన్న సమాచారం ప్రకారం.. పెళ్లి లేదా ఇతర వేడుకలకు బయట వ్యక్తులు హాజరు కాకూడదని.. ఫంక్షన్ హాల్ కు వచ్చి ఆహారం తినకూడదని.. ఒకవేళ తమ తనిఖీలలో దొరికిపోతే 5000 రూపాయల అపరాధ రుసుము లేదా మూడు నెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

కేవలం మహబూబాబాద్ లోనే కాదు ప్రతి ప్రాంతంలో ఉన్న ఫంక్షన్ హాల్లో ఇదే పరిస్థితి. వేడుకలు నిర్వహించేవారు తమ బంధువుల కోసం వంటలు వండితే.. బయటివారు వచ్చి తిని పోతున్నారు. ఇలాంటి సమయంలో అంచనా వేసుకున్న వంటలు తగ్గిపోయి.. వేడుకల నిర్వాహకులు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. పైగా తెలంగాణ రాష్ట్రంలో నాన్ వెజ్ కు విపరీతమైన ప్రియారిటి ఉంటుంది. అలాంటప్పుడు వండిన వంటలు నిండుకుంటే.. వేడుకలు చేసే వారి పరిస్థితి చెప్పనలది కాకుండా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిని చూసి చూసి ఆ ఫంక్షన్ హాల్ నిర్వాహకులు ఆ తరహా బోర్డు ఏర్పాటు చేశారు. ఈ బోర్డు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది. దీనిపై మెజారిటీ ప్రజలు ఫంక్షన్ హాల్ నిర్వాహకులు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ఫంక్షన్ హాల్ నిర్వాహకులు ఇటువంటి నిర్ణయాన్ని అమలు చేస్తే బాగుంటుందని చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper