Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu Agni Pariksha 2 : 'అగ్ని పరీక్ష 2'...

Bigg Boss 10 Telugu Agni Pariksha 2 : ‘అగ్ని పరీక్ష 2’ షోకి దరఖాస్తు చేసుకోవడం ఎలా..? పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం..

Bigg Boss 10 Telugu Agni Pariksha 2 : భారీ అంచనాల నడుమ ఈ ఏడాది ‘బిగ్ బాస్ 10’ ని నిర్వహించడానికి మేకర్స్ అన్ని విధాలుగా రెడీ అవుతున్నారు. గత సీజన్ లో ‘అగ్నిపరీక్ష’ అనే కాన్సెప్ట్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఈ షో ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి సామాన్యులుగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ పడాల టైటిల్ విన్నర్ గా నిలిచాడు, డిమోన్ పవన్ టాప్ 3 కంటెస్టెంట్ గా నిలిచాడు. […]

Bigg Boss 10 Telugu Agni Pariksha 2 : భారీ అంచనాల నడుమ ఈ ఏడాది ‘బిగ్ బాస్ 10’ ని నిర్వహించడానికి మేకర్స్ అన్ని విధాలుగా రెడీ అవుతున్నారు. గత సీజన్ లో ‘అగ్నిపరీక్ష’ అనే కాన్సెప్ట్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఈ షో ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి సామాన్యులుగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ పడాల టైటిల్ విన్నర్ గా నిలిచాడు, డిమోన్ పవన్ టాప్ 3 కంటెస్టెంట్ గా నిలిచాడు. మిగిలిన కంటెస్టెంట్స్ శ్రీజా , మర్యాద మనీష్ , మాస్క్ మ్యాన్ హరీష్ , ప్రియా , దివ్య వంటి వారు , ఈ షోలో బలమైన ప్రభావం చూపించారు. సామాన్యులుగా ఎంట్రీ ఇచ్చి టాప్ సెలబ్రిటీలుగా మారిపోయారు. మీరు కూడా అలా సామాన్యులుగా ‘బిగ్ బాస్ 10’ లోకి ఎంట్రీ ఇచ్చి మీ తలరాతని మార్చుకోవాలని అనుకుంటున్నారా?, అయితే త్వరలోనే మొదలు కాబోయే ‘అగ్నిపరీక్ష 2’ కి దరఖాస్తు చేసుకోండి.

నిన్నటి నుండి అప్లికేషన్స్ మొదలయ్యాయి, జూన్ 20 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఈ షో లో పాల్గొనాలని అనుకోవాళ్ళు bbtelugu.jiostar.com అని గూగుల్ లో కొట్టండి , వెబ్ సైట్ ఓపెన్ అవ్వగానే అందులో మీ వివరాలను పొందుపరిచి , మీ టాలెంట్ కి సంబంధించి 3 నిమిషాల వీడియో ని రికార్డు చేసి , అప్లోడ్ చేసి పంపండి. ఈ వీడియో సైజు 50 MB మించి ఉండకూడదు. MP4 మరియు MOV ఫార్మటు లో ఈ వీడియో ని షూట్ చెయ్యాలి. ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే పంపించండి , మరో వారం రోజులు మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు, ఈ దరఖాస్తు కోసం ఒక్క పైసా కూడా ఖర్చు చేయాల్సిన అవసరమే లేదు. మీ టాలెంట్ ని, మీ అదృష్టాన్ని ఒక్కసారి పరీక్షించుకోండి. మరో కళ్యాణ్ పడాల , డిమోన్ పవన్ లాగా అయ్యే అవకాశాన్ని వదులుకోకండి.

లక్షల మంది ఈ అగ్నిపరీక్ష షో కి దరఖాస్తులు చేసుకుంటారు , అంత మందిలో మనకి అవకాశం ఏమొస్తుందిలే అని తేలికగా తీసుకోకండి, మీకు అదృష్టం కలిసొచ్చి వాళ్ళ వైపు నుండి ఫోన్ కాల్ రావొచ్చు కదా. అలా ‘అగ్నిపరీక్ష 2’ షో లో పాల్గొని , టాస్కులు బాగా ఆడి , బిగ్ బాస్ 10 హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి పేరు తెచ్చుకుంటే , ఒక సామాన్యుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే అరుదైన అవకాశం మీకు దక్కొచ్చు కదా?, కాబట్టి ఈ అరుదైన అవకాశాన్ని వదులుకోకండి, వెంటనే దరఖాస్తు చేసుకోండి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper