
కోదాడ తిరుమల ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. డెలివరీ కోసం వచ్చిన గర్భిణీపై ల్యాబ్ టెక్నీషియన్ శ్రీకాంత్ అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. కొవిడ్ టెస్ట్ చేయాలంటూ గదిలోకి తీసుకెళ్లి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. బాధితురాలు కేకలు వేయడంతో శ్రీకాంత్ పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. కేసును వెనక్కి తీసుకోవాలంటూ బాధితులపై ఆస్పత్రి నిర్వహకుల ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.