Homeజాతీయ వార్తలుYS Sharmila: షర్మిల దీక్ష.. ఫలితం మాత్రం దక్కలేదు పక్కా

YS Sharmila: షర్మిల దీక్ష.. ఫలితం మాత్రం దక్కలేదు పక్కా

YS SharmilaYS Sharmila: తానోటి తలిస్తే దైవమొకటి తలచిందన్నట్లుగా ఉంది షర్మిల పరిస్థితి. ఏదో అనుకుంటే మరేదో జరిగినట్టు తయారయింది. హైదరాబాద్ లో ఆరేళ్ల చిన్నారి హత్యాచారం కేసులో వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల తన ప్రభావం చూపెట్టుకోవాలని సంకల్పించింది. కానీ వ్యూహం బెడిసికొట్టింది. రాజకీయం చేయడమంటే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడం కాదు. దాని వల్ల ఒనగూడే ప్రయోజనాలు లెక్కలోకి తీసుకోవాలి. అలా కాకుండా అనుకున్నదే తడవుగా చిన్నపిల్లలు చేసినట్లు చేయడంతో మొదటికే మోసం వచ్చింది. అందరిలో అభాసుపాలయ్యారు.

షర్మిలకు తెలంగాణలో పెద్దగా నాయకులు లేరు. ఆమె ఎక్కడికి వెళ్లినా పది సంఖ్యలో మాత్రమే జనం కనబడతారు. దీంతో ఆమె తన అనుచరులను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. బుధవారం హైదరాబాద్ లో దీక్ష చేసిన షర్మిల వెంట తక్కువ మందే ఉన్నారు. పైగా వారు ఎప్పుడు వెళ్లిపోతామనే ఆతృతతోనే ఉన్నట్లు కనిపించింది. ఈ నేపథ్యంలో బాధితురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేసినా ఎవరు పట్టించుకున్న దాఖలాలు కనిపించ లేదు. దీంతో ఆమె దీక్ష కాస్త అపహాస్యం అయిందని తెలుస్తోంది.

ఆమెకు ఎవరు సలహా ఇచ్చారో తెలియదు కానీ తప్పుడు దారిలో వెళ్లినట్లు కనిపించింది. వ్యూహాన్ని అమలు చేయడంలో ఆమె వెనుకబడిపోయినట్లు అనిపించింది. అందుకే దీక్షలో ఫెయిల్ అయ్యారు. ఆమె చేసిన ఏ డిమాండ్ కూడా ఫలితం చూపించలేదు. బాలిక కుటుంబాన్ని ఆదుకోవాలని, నష్టపరిహారం అందజేయాలని సూచించినా ప్రభుత్వం నుంచి పెద్దగా స్పందన రాలేదు. దీంతో ఆమె కులం చెడినా ఫలితం దక్కకపోవడం వంటి సామెతలా మారింది.

బాలిక వ్యవహారాన్ని రాజకీయం చేయాలని భావించినా సఫలం కాలేదు. రాజకీయాల్లో చాంపియన్ కావాలని కలలు కన్న నెరవేరలేదు. తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించాలని అనుకున్నా సాధ్యం కాలేదని తెలుస్తోంది. చిన్నారి హత్యతో రాజకీయ మైలేజీ సాధించాలని చూసినా ఫలితం మాత్రం దక్కలేదు. దీంతో ఆమె నైరాశ్యంల పడిపోయారు. షర్మిల అందరిలా కాకుండా ప్రత్యేకంగా ఉండాలని అనుకున్నా సాధ్యం కాకపోవడంతో నవ్వుల పాలయినట్లు తెలుస్తోంది. మొత్తానికి కులం చెడినా ఫలితం మాత్రం దక్కలేదని పార్టీ నేతలు ప్రకటించడం కొసమెరుపు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Delhi Protests

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...
Team India Bowling

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...
Oktelugu Epaper