
ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను సమర్థిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ మేరకు ఎన్నికల కౌటింగ్ కు పచ్చ జెండా ఊపింది. కాగా, ఎన్నికలను రద్దు చేస్తూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టులో అప్పీల్ చేసింది. తాజాగా దీన్ని విచారించిన హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పును తోసిపుచ్చింది. అయితే, ఈ ఏడాది ఏప్రిల్ 8న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి.