Homeఆంధ్రప్రదేశ్‌వైసీపీ దృష్టంతా రఘురామపైనే.. టార్గెట్ చేస్తున్న నేతలు

వైసీపీ దృష్టంతా రఘురామపైనే.. టార్గెట్ చేస్తున్న నేతలు

YCP focus on Raghu Rama Rajuలోక్ సభలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయించాలని వైసీపీ నేతలు చేయని ప్రయత్నాలు లేవు. అయినా వారి ఆశలు నెరవేరడం లేదు. ఎంపీ రఘురామపై ఈగ కూడా వాలడం లేదు. దీంతో వైసీపీ వర్గాల్లో అసంతృప్తి రేగుతోంది. ఎలాగైనా ఆయనపై అనర్హత వేటు వేయించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లాపై ఇప్పటికే ఒత్తిడి పెంచినా పని కాలేదు.

ఆయన పట్టించుకోవడం లేదు. దీంతో సభను స్తంభింపచేస్తామని చెప్పినా స్పందన లేకుండా పోతోంది. పార్టీ వ్యవహారాన్ని సభలో ప్రస్తావించడం ద్వారా చులకనై పోతామని భావిస్తున్నట్లు తెలుస్తోంది. లోక్ సభలో అవలంభించబోయే విధానాలపై చర్చించేందుకు సీఎం జగన్ ఎంపీలతో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నారు.

దీనికి రఘురామకు ఆహ్వానం అందలేదు. వైసీపీ ప్రభుత్వం లోక్ సభలో ఎక్కువ మంది ఎంపీలున్న పార్టీ. కానీ బీజేపీకి మిత్రపక్షంగానే వ్యవహరిస్తోంది. ఎక్కడ కూడా సమస్యలపై పోరాడిన దాఖలాలు లేవు. స్టేట్ కు సంబంధించిన ఏ ఒక్క అంశంపైనా ఇంతవరకు మాట్లాడిన దాఖలాలు లేవు. పోలవరం ప్రాజెక్టు గురించైనా, కృష్ణా జలాల వివాదం, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ, పెండింగ్ నిధుల విడుదల, రుణ పరిమితి తగ్గింపు, ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాలకు నిధులు వంటి సమస్యలపై ఎప్పుడూ మాట్లాడలేదు.

ఇప్పుడు వైసీపీ దృష్టంతా రఘురామ కృష్ణంరాజుపై ఉంది. ఆయనకు అనర్హత వేటు వేసేలా స్పీకర్ పై ఒత్తిడి తేవాలనే విషయంపైనే ప్రధానంగా సీఎం సలహాలిస్తారన్న అభిప్రాయం వైసీపీ వర్గాల్లో కనిపిస్తోంది. సభను స్తంభింపచేయడంతోపాటు ఆయనపై ఆరోపణలు చేయడం ద్వారా ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ తరహా ప్రయత్నాలను ఇప్పటికే విజయసాయిరెడ్డి ప్రారంభించారు. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా వైసీపీ ప్లాన్ చేసుకునే అవకాశం ఉందన్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper