Homeఎంటర్టైన్మెంట్అరె.. ఆ వీడియోలో దానయ్య కనిపించాడు !

అరె.. ఆ వీడియోలో దానయ్య కనిపించాడు !

యావత్తు భారతీయ సినీ లోకం ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కోసం ఎంతగానో ఆశగా ఎదురుచూస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాకి పాన్ ఇండియా రేంజ్ లో భారీ క్రేజ్ ఉంది. మరి అలాంటి సినిమా నిర్మాత ఎలా ఉండాలి ? కానీ, అదేంటో గానీ, మొదటి నుండి దానయ్యకి సరిగ్గా గుర్తింపు రాలేదు. దానికి తోడు ఆర్ఆర్ఆర్ నుండి ఏది వదిలినా.. అది హీరోలకు దర్శకుడికి సంబంధించింది తప్పితే.. మరో గోల లేదు. అసలు ఒక […]

RRR Making videoయావత్తు భారతీయ సినీ లోకం ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కోసం ఎంతగానో ఆశగా ఎదురుచూస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాకి పాన్ ఇండియా రేంజ్ లో భారీ క్రేజ్ ఉంది. మరి అలాంటి సినిమా నిర్మాత ఎలా ఉండాలి ? కానీ, అదేంటో గానీ, మొదటి నుండి దానయ్యకి సరిగ్గా గుర్తింపు రాలేదు. దానికి తోడు ఆర్ఆర్ఆర్ నుండి ఏది వదిలినా.. అది హీరోలకు దర్శకుడికి సంబంధించింది తప్పితే.. మరో గోల లేదు.

అసలు ఒక విధంగా ఈ సినిమాకి డీవీవీ దానయ్య నిర్మాత అనే విషయాన్ని చాలామంది మరచిపోయారు. ఎంతైనా రాజమౌళి సినిమాలకు నిర్మాణ బాధ్యతలు కూడా ఆయన టీమే చూసుకుంటూ ఉంటుంది. ఎంత పెద్ద నిర్మాత అయినా, జస్ట్ మేనేజర్ లాగే ఉండాలి. అవసరం అయినప్పుడు కేవలం చెక్ పవర్ వరకే నిర్మాత ఉంటాడు రాజమౌళి సినిమాల విషయంలో.

దానయ్య పరిస్థితి కూడా ఇన్నాళ్లు అలాగే ఉంది. ఇంకా చెప్పాలంటే, అంతకన్నా దారుణంగా ఉంది. అయితే తాజాగా విడుదల చేసిన “ఆర్ఆర్ఆర్” మేకింగ్ వీడియోలో దానయ్య కోసం ఓ షాట్ తీశాడు రాజమౌళి. అరె.. మేకింగ్ వీడియోలో దానయ్య కనిపించాడురా అంటూ నెటిజన్లు కూడా తెగ ఉత్సాహపడుతున్నారు.

మొత్తానికి ఈ మేకింగ్ వీడియోతో దానయ్యకి గుర్తింపు వచ్చింది. ఇక ఈ మేకింగ్ వీడియోతో సినిమా పై ఉన్న భారీ అంచనాలు ఇంకా రెట్టింపు అయ్యాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం, చరణ్ అల్లూరి పాత్రల్లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper