Homeజాతీయ వార్తలు‘సాగర్’ వీరుడి వేటలో.. కాషాయదళం

‘సాగర్’ వీరుడి వేటలో.. కాషాయదళం

Nagarjuna Sagar By-Election
సందర్భం ఏదయినా.. అది సంచలనమే.. రాజకీయాలు కావొచ్చు.. బైంసా అల్లర్లు కావచ్చు.. అసెంబ్లీ సమావేశాలు కావచ్చు.. సూర్యపేట కబడ్డీ పోటీలు కావచ్చు.. ఏది జరిగినా సరే ప్రజలంతా ఉత్కంఠ భరితంగా మునివేళ్లపై నిలుచునే పరిస్థితి ఉంది. తెలంగాణలో చీమ చిటుక్కుమన్నా.. ఉలిక్కి పడాల్సి వస్తోంది. ఎన్నికలకంటే.. ఉప ఎన్నికలే రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. పరువుకోసం ఆరాట పడుతున్నాయి. తమ బలాన్ని చాటేందుకు తహతహలాడుతున్నాయి. తాజాగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామాన్ని తలపించాయి.

కేవలం మాటలతోనే ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించే విద్యలో ఆరితేరిన బీజేపీ మాత్రం నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు వచ్చేసరికి గుంభనంగా ఉంటోంది. మాటలు రానట్లు వ్యవహరిస్తోంది. సైలెంట్ గా ఉండడం వల్ల తమ పార్టీ శ్రేణులకు ఆ పార్టీ ఎలాంటి సంకేతాలు పంపిస్తోందంటే.. ఓటమిని ముందే ఒప్పుకున్నట్లుగా… ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధించిన ఘన విజయాలతో కారు నాగార్జున సాగర్ వైపు వేగంగా దూసుకెళుతోంది. అభ్యర్థి ఎవరైనా కావొచ్చు… అక్కడ గెలవడమే తరువాయి… ప్రత్యర్థుల ముందు బలాన్ని చాటడమొక్కటే.. మిగిలింది అన్నట్లు తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులు వ్యవహరిస్తున్నారు.

నాగార్జున సాగర్ ఉప ఎన్నికను బీజేపీ ఎందుకు పట్టించుకోవడం లేదంటే.. అభ్యర్థి దొరక్క పోవడం ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అధికార పార్టీ ఇంతవరకు తన అభ్యర్థిని ప్రకటించలేదు. కాంగ్రెస్ తరఫున జానారెడ్డి ఖాయమయ్యారు. దుబ్బాక నుంచి దూకుడుగా వ్యవహరించిన బీజేపీ సాగర్ దగ్గరకు వచ్చేసరికి చాలా వరకు నెమ్మదించింది. ఆ ఊపును తగ్గించుకుంది. అధికార పార్టీ ఎలాగూ బలమైన అభ్యర్థిని బరిలో దింపుతుంది.

కాంగ్రెస్ నుంచి జానారెడ్డి సైతం బలమైన అభ్యర్థి. ఇద్దరు ఉద్దండుల మధ్య పోటీని తట్టుకుని నిలబడేదెవరా..? అని బీజేపీ అన్వేషణ కొనసాగిస్తోంది. గెలుపు సంగతి తరువాత కనీసం ఓట్లు చీల్చి రెండోస్థానం అయినా దక్కించుకోవాలని, లేకుంటే బీజేపీ పని అయిపోయినట్లేనని ప్రత్యర్థులు ప్రచారం చేస్తారేమోనన్న భయం కూడా వెంటాడుతోంది. జానారెడ్డి ఇక్కడి నుంచి ఏడుసార్లు విజయం సాధించారు. ఈసారి గెలవాలంటే చెమటోడ్చక తప్పదు. ఈ పరిస్థితులను ఎలా సద్వినియోగం చేసుకోవాలా? అనే యోచనలో బీజేపీ ఉంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper